Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4’ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు బాలకృష్ణ, రామ్ చరణ్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బాలయ్య గారు అంటూ రామ్ చరణ్ దగ్గరకి వస్తుంటే, అలా పిలిస్తే నువ్వు నా సెట్స్ లోకి రావడానికి వీలు లేదు, బ్రో అని పిలువు అంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరు ప్రేమగా ఆలింగనం చేసుకొని మీడియా తో మాట్లాడుతారు. బాలయ్య మాట్లాడుతూ ‘డాకు మహారాజ్..గేమ్ చేంజర్..ఈ సంక్రాంతికి వస్తున్నాయి. రెండు కూడా సూపర్ హిట్ అవుతాయి. ఇండస్ట్రీ మూడు పూలు, ఆరు కాయలతో కళకళలాడాలి’ అంటూ ఆయన చెప్పుకొస్తాడు.
ఈ షోకి రామ్ చరణ్ స్నేహితులు శర్వానంద్, వికాస్ విచ్చేస్తారు. వేళ్లతో సరదాగా కాసేపు రామ్ చరణ్ జరిపిన సంభాషణ హైలైట్ గా నిలవబోతుందని టాక్. ఇక ఆ తర్వాత గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఈ ఎపిసోడ్ లో సందడి చేయబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను ఈ షోలో పంచుకున్నారట. ఇక అదే విధంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ చేయడం, ఆయనతో తనకి ఉన్నటువంటి అనుబంధం గురించి బాలయ్య తో పంచుకున్నాడు. మీ బాబాయ్ నుండి ఏమి నేర్చుకున్నావు అని రామ్ చరణ్ ని బాలయ్య బాబు అడగగా, ‘ఆయన నుండి ఓపికగా ఉండడం ఎలా అనేది నేర్చుకున్నాను’ అంటూ సమాధానం ఇస్తాడు. ఇది ఇలా ఉండగా గత సీజన్ లో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు రామ్ చరణ్ కి ఫోన్ చేస్తాడు. రామ్ చరణ్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో ఆట పట్టిస్తాడో మన అందరం చూసాం.
పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఆ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉండడం చూసి అభిమానులు ఎంతో మురిసిపోయారు. నేడు రామ్ చరణ్ ముఖ్య అతిథి గా విచ్చేయగా, ప్రభాస్ కి ఫోన్ చేస్తాడు. ఈ ఫోన్ కాల్ సంభాషణకి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే పూర్తి అయ్యింది. ‘ఒరేయ్..చరణ్’ అంటూ ప్రభాస్ చాలా ప్రేమగా పలకరిస్తాడట. ప్రభాస్ కూడా రామ్ చరణ్ ని ఒక రేంజ్ లో ఆట పట్టించినట్టు తెలుస్తుంది. అలా ఫుల్ జోష్ తో సాగిపోతుంది ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్. రెండు రోజుల్లో ఈ ఎపిసోడ్ ప్రోమో రాబోతుంది. ఆ తర్వాత మొదటి వారం లో ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. రామ్ చరణ్, బాలయ్య బాబు మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం వల్ల ఈ ఎపిసోడ్ అద్భుతంగా వస్తున్నట్టు తెలుస్తుంది.