Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒక మూస ధోరణి లో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి కొంత మంది మాత్రం ఎప్పుడు ముందు వరుస లో ఉంటారు. ఒకప్పుడు కృష్ణ ఇలాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక గుర్తింపుని అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో కృష్ణ వారసుడైన మహేష్ బాబు ప్రయోగాత్మకమైన సినిమాలను చేసే ఈ జనరేషన్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.
తన కెరియర్ స్టార్టింగ్ లోనే జయంత్ సి పరాంజి దర్శకత్వంలో టక్కరి దొంగ అనే ఒక కౌబాయ్ సినిమాలో నటించి మెప్పించాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, నటనపరంగా మహేష్ బాబు మాత్రం అందరిని మెప్పించడంలో 100% సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అయిన ఎస్ జే సూర్య దర్శకత్వంలో నాని అనే సినిమా చేశాడు. ఈ సినిమాని అప్పటివరకు తెలుగులో హీరోలు ఎవరు చేయని విధంగా ఒక ఎక్స్పరిమెంటల్ మూవీగా చేసి ఒక ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. అయినప్పటికీ మహేష్ బాబు నటన మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.
ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర గానీ, ఆయన చూపించిన హావభావాలుగానీ నిజంగా మరే హీరో అలాంటి నటనను కనబరచలేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత మళ్లీ 2014 వ సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
అయితే మహేష్ బాబు చేసిన ప్రతి ప్రయోగం ప్లాప్ అయినప్పటికీ, నటన పరంగా ఆయన మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయి ఉంటే మరిన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసేవాడేమో…అందుకే ఇప్పుడున్న జనరేషన్ లో మహేష్ బాబును మించి ప్రయోగాలు చేసిన హీరోలు మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…