Bigg Boss 6 Telugu 9th Week Elimination: గడిచిన కొద్ది వారాల నుండి బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవుతూ వస్తున్నా సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము..వీళ్ళు వోటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యారా అంటే ప్రేక్షకులు నమ్మే పరిస్థితి లో లేని ఇంటి సభ్యులు ఎవరైనా ఉన్నారా అంటే అది అర్జున్ కళ్యాణ్ మరియు సూర్య ఎలిమినేషన్స్ అని చెప్పొచ్చు..వీళ్ళిద్దరిలో అర్జున్ ఎలిమినేట్ అవ్వబొయ్యే చివరి రెండు వారాల ముందు అద్భుతంగా ఆడి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సమయం లో ఎలిమినేట్ అయితే..సూర్య మొదటి రోజు నుండే బాగా ఆడుతున్నప్పటికీ ఎలిమినేట్ అవ్వాల్సొచ్చినా పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు ఈ 9 వ వారం లో ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులు రేవంత్ , బాలాదిత్య , ఆది రెడ్డి, శ్రీ సత్య , మెరీనా, రోహిత్, ఫైమా , కీర్తి మరియు ఇనాయ సుల్తానా..వీరిలో ప్రస్తుతం వోటింగ్ ప్రకారం ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు..ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఈ వారం అత్యధిక ఓట్లు దక్కించుకొని రేవంత్ , ఇనాయ , బాలాదిత్య మరియు శ్రీ సత్య సేఫ్ జోన్ లో ఉన్నారు..కానీ అందరికంటే తక్కువ ఓట్లతో స్వల్పమైన తేడా తో మెరీనా, రోహిత్ లతో పాటుగా గీతూ మరియు బాలాదిత్య కూడా ఉన్నారు..గీతూ డేంజర్ జోన్ లోకి రావడం ఇదే తొలిసారి..దానికి కారణం గత వారం లో ఆమె ఆడిన ఆటనే అని చెప్పొచ్చు..అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కులో గీతూ మరియు బాలాదిత్య మధ్య గొడవ జరిగింది..ఈ గొడవలో బాలాదిత్య గ్రాఫ్ అమాంతం పడిపోగా..గీతూ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది..ఒక్క సిగరెట్ కోసం ఆయన ప్రవర్తించిన తీరు ఇంటి సభ్యులతో పాటుగా, చూసే ప్రేక్షకులకు కూడా చాలా తప్పుగా అనిపించింది.

అందుకే ఈ వారం ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది..ఆయనతో పాటుగా మెరీనా మరియు రోహిత్ లలో ఎవరో ఒకరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది..వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారని..ఈ వారం వీళ్ళు ఆడే ఆటతీరుని బట్టే ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది తెలుస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు.