https://oktelugu.com/

Bollywood Villains: తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న బాలీవుడ్ విలన్లు వీళ్లే…

ఇప్పటికే అనిమల్ సినిమాలో బాబి డియోల్ చేసిన విలన్ పాత్ర తెలుగు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా తన ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులందరిని కట్టిపడేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 13, 2023 / 12:28 PM IST

    Bollywood Villains

    Follow us on

    Bollywood Villains: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మన హీరోలకి పోటీగా ఉండే విలన్లు ఎవరు అని ఆరాధిస్తున్న క్రమంలో బాలీవుడ్ కి సంబంధించిన కొంతమంది స్టార్ హీరోలని ఇప్పుడు విలన్ గా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బాలయ్య బాబు హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో అనిల్ రావిపూడి అర్జున్ రాంపాల్ విలన్ గా చేసి ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అలాగే అర్జున్ రాంపాల్ కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో విలన్ గా అర్జున్ రాంపాల్ కి మంచి క్రేజ్ పెరిగింది. ఈయన ఇప్పుడు పలు తెలుగు సినిమాల్లో కూడా చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ హిందీలో చాలా సినిమాల్లో హీరోగా నటించి తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోగా కూడా ఎదిగాడు ఇక ఇలాంటి క్రమంలో ఆయన విలన్ గా మారి విలన్ పాత్రలు చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక దానికి తగ్గట్టుగానే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న దేవర సినిమాలో మెయిన్ విలన్ గా నటించడం అనేది సైఫ్ అలీ ఖాన్ కి ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. ఈ సినిమాతో కనక తను తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగితే తెలుగులో స్టార్ విలన్ గా కూడా తను గుర్తింపు పొందుతాడు…

    ఇప్పటికే అనిమల్ సినిమాలో బాబి డియోల్ చేసిన విలన్ పాత్ర తెలుగు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా తన ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులందరిని కట్టిపడేశాడు. తను కనిపించేది కొద్దిసేపు అయినప్పటికీ ఆ ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకుల్లో చాలా ఎక్కువగా ఉండిపోయేలా తన నటనతో ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. హీరో రన్బీర్ కపూర్ కి ఎంత గుర్తింపు అయితే వచ్చిందో విలన్ గా చేసిన బాబీ డియోల్ కి కూడా అంతే మంచి గుర్తింపు రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

    ఇలా ప్రస్తుతానికి చాలా మంది బాలీవుడ్ హీరోలు విలన్లు గా మారి తెలుగు లో మంచి క్రేజ్ ని గుర్తింపు ని సంపాదించుకుంటున్నారు ఇక వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది విలన్లు గా మారడానికి రెడీ గా ఉన్నారు…