
Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హీరో. ఇటీవల ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించింది 14 సినిమాలే అయినా.. మిగతా హీరోలకంటే రామ్ చరణ్ కు స్పెషల్ గుర్తింపు వచ్చిందనే చెప్పొచ్చు. ఇక మార్చి 27న ఆయన 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మెగా హీరో గురించి పలు విషయాలు ఆసక్తికంగా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో రామ్ చరణ్ మూడు బ్లాక్ బస్టర్ మూవీస్ ను మిస్ చేసుకున్నాడన్న చర్చ సాగుతోంది. మరి ఆ మూడు సినిమాలేవో చూద్దాం..
జెర్సీ:
హీరో నాని కెరీర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన జెర్సీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథను ముందుగా రామ్ చరణ్ కు వినిపించారట. ఆయనకు ఈ కథ నచ్చిందట. కానీ అప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉండడంతో జెర్సీ చేయలేకపోయారని అనుకుంటున్నారు.

శ్రీమంతుడు:
కొరరటాల డైరెక్షన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ మూవీ బ్లాక్ బస్టర్. మహేష్ బాబు, శృతిహాసన్ కలిసి నటించిన ఈ మూవీ స్టోరీ చాలా కూల్ గా వెళ్తుంది. అప్పటి వరకు మహేష్ సినిమాలు ప్లాప్ అవుతున్న తరువాత శ్రీమంతుడు తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే శ్రీమంతుడు కోసం కొరటాల రామ్ చరణ్ ను సంప్రదించాడట. కానీ పలు కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయలేకపోయాడు.
ఓకే బంగారం:
మలయాల నటుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ఓకే బంగారం’. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందుగా రామ్ చరణ్ ను అనుకున్నారట. కానీ తెలుగులో మాస్ హీరో అనిపించుకుంటున్న రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తే ఇమేజ్ తగ్గుతుందని ఒప్పుకోలేదట.
ఇలా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను రామ్ చరణ్ చేయాల్సి ఉండగా ఇతర హీరోలు చేశారన్న చర్చ సాగుతోంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు 14 సినిమాలు కంప్లీట్ చేశారు. 15న సినిమాను డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్నాడు. భారీ బడ్జెట్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పిక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి.