https://oktelugu.com/

Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్ ఇవే !

Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగంలో రంగులు మార్చలేక, మళ్ళీ అభిమానుల కోరిక మేరకు ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ వెండితెర పై రీఎంటీ ఇచ్చారు. వయోభారం పెరుగుతున్న క్రమంలో చిరుకి గత వైభవం ఉంటుందా ? అన్న అనేక అనుమానాల మధ్య వచ్చిన ‘ఖైదీ నెంబర్‌ 150’ వంద కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. చిరు స్టార్ డమ్ చెక్కు చెదరలేదు అని రుజువు అయ్యింది. ఆ ఉత్సాహంతోనే వరున […]

Written By:
  • Shiva
  • , Updated On : May 7, 2022 / 11:57 AM IST
    Follow us on

    Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగంలో రంగులు మార్చలేక, మళ్ళీ అభిమానుల కోరిక మేరకు ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ వెండితెర పై రీఎంటీ ఇచ్చారు. వయోభారం పెరుగుతున్న క్రమంలో చిరుకి గత వైభవం ఉంటుందా ? అన్న అనేక అనుమానాల మధ్య వచ్చిన ‘ఖైదీ నెంబర్‌ 150’ వంద కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. చిరు స్టార్ డమ్ చెక్కు చెదరలేదు అని రుజువు అయ్యింది.

    Chiranjeevi Disaster Movies

    ఆ ఉత్సాహంతోనే వరున ప్రాజెక్ట్‌ లతో ఫుల్‌ బిజీ అయిపోయారు చిరు. మధ్యలో ‘సైరా నరసింహ రెడ్డి’ భారీ దెబ్బకొట్టింది. చరణ్ కి సుమారు 30 కోట్లు నష్టం తెచ్చి పెట్టింది. అందుకే, చిరు సినిమాల సంఖ్యను డబుల్ చేశాడు. సైరాకి వచ్చిన నష్టాలను ‘ఆచార్య’ రూపంలో లాభాలుగా మార్చుకోవాలని చాలా ప్లాన్డ్ గా చేసిన సినిమా కూడా అతి దారుణంగా పరాజయం పాలు అయ్యింది.

    వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ కూడా అపజయాన్ని మూటగట్టుకున్నాడు. పైగా రామ్‌ చరణ్‌ ను సినిమాలో పెట్టుకుని కూడా ప్లాప్ కొట్టడం చిరు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో భారీ అంచనాల నడుమ వచ్చి ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిన్నాడు. పైగా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ ప్లాప్‌ చిత్రంగా మిగిలిపోయింది ఆచార్య.

    అసలు ఇప్పటి వరకూ ‘మెగాస్టార్ చిరంజీవి’ సినీ కెరీర్ లో భారీ డిజాఫ్టర్‌ లుగా మిగిలిన చిత్రాలు ఏమిటో తెలుసుకుందాం.

    అంజి :

    2004లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం చిరుకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. పైగా చిరంజీవి సరసన ఈ చిత్రంలో మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ నటించడం విశేషం. భారీ అంచనాలను
    తారుమారు చేసి భారీ పరాజయాన్ని చవిచూసింది ఈ చిత్రం.

    శంకర్‌ దాదా జిందాబాద్‌ :

    Shankardada Zindabad

    బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ నటించిన ‘మున్నాభాయ్‌’కి రీమేక్ గా వచ్చింది ఈ సినిమా. ప్రేక్షకుల ఆదరణ అందుకోలేక డిజాస్టర్‌
    గా మిగిలింది.

    మృగరాజు:

    Mrugaraju

    హాలీవుడ్‌ చిత్రం ‘ది హోస్ట్‌ అండ్‌ ది డార్స్క్‌నెస్‌’ సినిమాకి ఈ చిత్రం రీమేక్‌. కాగా ఈ చిత్రం సైతం చిరు కెరీర్ లోనే భారీ డిజాస్టర్‌ గా మిగిలింది. గుణ శేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా మొదటి రోజే చతికిలపడింది.

    బిగ్‌ బాస్‌:

    Big Boss

    బిగ్‌ బాస్‌ అంటే.. రియాలిటీ షో కాదు అండి. మెగాస్టార్ గతంలో చేసిన ఒక సినిమా. పేరులో ఉన్న గొప్పతనం సినిమాలో లేక ఈ సినిమా కూడా భారీ పరాజయాన్ని చవిచూసింది.

    ఎస్.పి.పరశురాం :

    S P Parasuram

    రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1994లో విడుదలైన ఈ చిత్రం కూడా భారీ ఫ్లాప్ అయ్యింది. అసలు మెగాస్టార్ – శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా ప్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

    స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ :

    Stuartpuram Police Station

    మెగాస్టార్ – విజయశాంతి కాంబోలో వచ్చిన ఈ చిత్రం కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

    అలాగే మరికొన్ని సినిమాలు చూద్దాం. చిరంజీవి హీరోగా నటించిన ‘లంకేశ్వరుడు, రాజ విక్రమార్క, యుధ్ధ భూమి’ సినిమాలు కూడా ప్లాప్ చిత్రాలుగా మిగిలిపోయాయి. అదేవిధంగా మోహన్‌ బాబు – చిరు కలిసి నటించిన చక్రవర్తి సినిమా కూడా ఆ రోజుల్లో నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది.

    ఈ కోవలోనే “ఆరాధన, త్రినేత్రుడు, కిరాతకుడు, జేబు దొంగ, రుద నేత్ర, చాణక్య శపథం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు, హీరో’ వంటి చిత్రాలు కూడా నష్టాల వలయంలో చిక్కుకొని బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడ్డాయి. మొత్తమ్మీద పైన చెప్పుకున్న చిత్రాలన్నీ మెగాస్టార్‌ సినీ కెరీర్లోనే భారీ డిజాస్టర్లు మిగిలిపోయాయి.

    Tags