Biggest Disasters in Tollywood: తెలుగు సినిమాలు ఇటీవల వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ రూపొందించి చేస్తున్నా ప్రేక్షకాజనం ఆదరించడం లేదు. దీంతో వారం తిరిగేలోపే థియేటర్ నుంచి వెళ్తున్నాయి. ఈ క్రమంలో హీరోలపై ఎక్స్పెక్ట్ పెట్టుకున్న నిర్మాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే కొందరు డైరెక్టర్లు మాత్రం హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీస్తున్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరించేందుకు కృష్టి చేస్తున్నారు. ఇలా కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కానీ రిలీజైన తరువాత అనుకున్న ఫలితాలు రావడం లేదు. అలా హెవీ హెప్స్ తో వచ్చి డిజాస్టరయిన టాలీవుడ్ సినిమాల గురించి తెలుసుకుందాం.

రాధేశ్యామ్:
ప్రభాస్, పూజాహెగ్డే నటీనటులగా వచ్చిన మూవీ ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 11న రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్ల పైమాటే. కానీ థియేటర్ వసూళ్లు మాత్రం రూ.150 కోట్లని టాక్. ఇక ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఇక్కడి నుంచి రూ.300 కోట్లు వసూలైనట్లుసమాచారం. మొత్తంగా ఈ సినిమా ద్వారా రూ.120 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

లైగర్:
పూరిజగన్నాథ్ డైరెక్షన్లోవచ్చిన లైగర్ మూవీ ఆగస్టు 25 2022న రిలీజైంది. విజయ్ దేవరకొండ, అనన్యపాండే కలిసి నటించారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం రూ.100 కోట్లు పెట్టారని అంచనా. కానీ రూ.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓటీటీ వేదికగా 22 సెప్టెంబర్ నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. అయినా ఆశించినంత కలెక్షన్స్ లేవు. మొత్తంగా ఈ మూవీకి రూ.61.80 కోట్ల నష్టం వచ్చింది.

ఆచార్య:
కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరో రామ్ చరణ్ లు కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజైంది.. మెగా తండ్రి, కొడుకులు కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండేవి. ఇందులో భాగంగా ఈ సినిమాకు బడ్జెట్ రూ.100 కోట్లు పెట్టినట్లు సమాచారం. అయితే 70 నుంచి 80 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. అయితే సినీ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ సినిమాకు 84.14 కోట్లు నష్టం వచ్చింది.

అజ్ఞాతవాసి:
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు. భారీ అంచనాతో 2018 జనవరి 10న రిలీజైన ఈ సినిమా మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాకు రూ.66.10 కోట్ల నష్టం వచ్చినట్లు సమాచారం.

స్పైడర్:
మహేశ్ బాబు, తమిళ డైరెక్టర్ మురుగున్ కాంబినేసన్లో వచ్చిన ‘స్పైడర్’ తీవ్ర నిరాశ పరిచింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అయిన ఇందులో ప్రముఖ డైరెక్టర్ జై సూర్య విలన్ గా నటించారు. ఈ సినిమా 2017 సెప్టెంబర్ 27న రిలీజైంది. దీనిని నిర్మించేందుకు రూ.120 కోట్లు వెచ్చించారు. అయితే 70 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం. మొత్తంగా ఈ సినిమాకు 63.8 కోట్ల నష్టం వచ్చింది.
సాహో:
ప్రభాస్ బాహుబలి తర్వాత నటించిన భారీ చిత్రం ‘సాహో’. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. కానీ ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేదు. దీంతో ఈ మూవీ ర.52.15 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
ఎన్టీఆర్ కథానాయకుడు:
సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ నేపథ్యంలో వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’పై ఎన్నో అంచానాలు ఉండేవి. బాలకృష్ణ ఇందులో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. అయితే ఈ సినిమా రూ.50.27 కోట్ల నష్టాన్ని తెచ్చుకుంది.

ఎన్టీఆర్ మహానాయకుడు:
‘ఎన్టీఆర్ కథానాయకుడు’కు సీక్వెల్ గా దీనిని నిర్మించారు. ఈ సినిమాకూ కూడా రూ.46 కోట్ల నష్టం వచ్చింది.
సైరా నరసింహారెడ్డి:
హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో పోషించారు. ఇందులో నయనతార హీరోయిన్. ఈ సినిమాకు రూ.43.45 కోట్ల నష్టం వచ్చింది.

నేనొక్కడినే:
సుకుమార్, మహేశ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ నేనొక్కడినే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వచ్చిన నష్టం రూ.42.70 కోట్లు.

బ్రహ్మోత్సవం:
‘శ్రీమంతుడు’ తరువాత మహేశ్ బాబు నటించినమూవీ ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో రూ.38.80 కోట్ల నష్టం వచ్చింది.
