https://oktelugu.com/

OTT Movies: ఈ రోజు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, సీరీస్ లు ఇవే…

లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో విజయ్ దళపతి హీరో గా చేసిన లియో సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మంచి సినిమా గా గుర్తింపు పొందింది.ఇక తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది.

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2023 / 03:18 PM IST

    OTT Movies

    Follow us on

    OTT Movies: సినిమా అభిమానులు సినిమాలని ఎక్కువ సంఖ్యలో చూడడానికి ఇష్టపడుతుంటారు థియేటర్లకి వచ్చిన సినిమాలు మాత్రమే కాకుండా ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న సినిమాలను కూడా చూస్తూ ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే థియేటర్లో వచ్చిన సినిమాలు కూడా చాలా తక్కువ రోజులకే అంటే ఓటిటిలో అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి… అదే తరహాలో తమిళ్ తెలుగులో థియేటర్లో వచ్చిన భారీ సినిమాలు, అలాగే కొన్ని సీరీస్ లు కూడా ఈరోజు నుంచి ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్నాయి అవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

    లియో
    లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో విజయ్ దళపతి హీరో గా చేసిన లియో సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మంచి సినిమా గా గుర్తింపు పొందింది.ఇక తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడింది..అయితే ఈ సినిమాలో విజయ్ తో పాటు అతనికి జోడీ గా త్రిష కూడా నటించింది. ఇక బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా కి ఓపెనింగ్స్ చాలా ఎక్కువ గా వచ్చాయి ఎందుకంటే డైరెక్టర్ లోకేష్ గత చిత్రం అయిన విక్రమ్ మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకి మంచి అంచనాలు నెలకొన్నాయి…దాంతోనే ఈ సినిమా కి మంచి కలక్షన్స్ వచ్చాయి…ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది… మరి ఈ సినిమా ఓటిటి లో ఏ మేరకు సత్తా చాటుతోంది చూడాలి…

    భగవంత్ కేసరి…
    అనిల్ రావిపూడి డైరెక్షన్ లో
    నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్‌ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా లో హీరోయిన్‌ శ్రీలీల కూడా ఒక కీలకమైన పాత్ర లో నటించి మెప్పించింది. ఇక తను యాక్టింగ్‌ మాత్రమే కాకుండా యాక్షన్‌ సీన్స్‌లోనూ అదరగొట్టింది. గత నెల దసరకు థియేటర్ లో రిలీజైన ఈ మూవీ మంచి విజయం దక్కించుకుంది. ఇక ఈ మూవీ ఈ రోజు ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…ఇక బాలయ్య ఓటిటి లో ఎంతవరకు సందడి చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

    ది విలేజ్
    తమిళం తో పాటు తెలుగు లో కూడా మంచి పేరు తెచ్చుకున్న నటుడు ఆర్య.ఈయన ది విలేజ్‌ పేరుతో ఒక హారర్‌ వెబ్‌ సిరీస్‌ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను బాగానే భయపెడుతున్నాయి. ఇక దాంతో ఈ సీరీస్ కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఇది ఎంత మేరకు ప్రేక్షకులను కట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది…