https://oktelugu.com/

RRR: RRR కి భారీ నష్టాలను మిగిలించిన ప్రాంతాలు ఇవే

RRR: బాహుబలి వంటి సంచలనాత్మక సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన #RRR చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చ్ 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్ని బాషలలో విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని సరికొత్త […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 16, 2022 / 12:30 PM IST
    Follow us on

    RRR: బాహుబలి వంటి సంచలనాత్మక సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన #RRR చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చ్ 25 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్ని బాషలలో విడుదల అయ్యి సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త సెన్సషనల్ గా మారింది..అదేమిటి అంటే #RRR సినిమాకి కొన్ని మాస్ ప్రాంతాలలో నష్టాలు వాటిల్లాయి అని, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యినప్పటికీ కూడా బయ్యర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు అని..ప్రాంతాల వారీగా బాహుబలి సినిమాకి వచ్చిన లాభాల తో పోలిస్తే #RRR కి వచ్చిన లాభాలు చాలా తక్కువ అంటూ కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి..ఇందులో నిజానిజాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    RRR

    బాహుబలి వంటి సెన్సేషన్ తర్వాత రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలను పెట్టి ఒక్క మల్టీస్టార్ర్ర్ చెయ్యబోతున్నాడు అనే వార్త అధికారికముగా ప్రకటించిన రోజు నుండే ఈ సినిమా కి ట్రేడ్ లో ఒక్క రేంజ్ క్రేజ్ ఏర్పడింది..ప్రతి ఏరియా నుండి కనివిని ఎరుగని రేంజ్ రేట్స్ తో ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలి 2 కి వచ్చిన క్లోసింగ్ కలెక్షన్స్ తో సమానంగా జరిగింది..ఇది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది..కానీ అనుకోకుండా కరోనా మహమ్మారి మన దేశం లోకి రావడం..ఆ తర్వాత లాక్ డౌన్లు పడడం..షూటింగ్ ని నిలిపి వెయ్యడం..ఇలా ఎన్నో అడ్డంకులు రావడం తో ముందు ప్రకటించిన తేదీ లో ఈ సినిమా రాలేకపోయింది..ఆలా దాదాపుగా మూడు సార్లు ఈ సినిమా వాయిదా పడి బయ్యర్లకు వడ్డీల రూపం లో భారం ఒక్క రేంజ్ లో పెరిగిపోయింది..మొత్తానికి ఈ అడ్డంకులు అన్ని దాటుకొని థియేటర్స్ లోకి వచ్చింది #RRR మూవీ..మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు అద్భుతమైన వసూళ్లను రాబట్టింది.

    Also Read: NTR Role in RRR: RRR లో తారక్ పాత్రని అందుకే తగ్గించాము

    కానీ అనేక సార్లు వాయిదా పడడం వల్ల ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కి వడ్డీలు పెరిగిపోవడం..దానికి తోడు బాహుబలి పార్ట్ 2 స్థాయి రన్ ఈ సినిమాకి రాకపోవడం తో ఆంధ్ర ప్రదేశ్ లోని C మరియు D సెంటర్స్ ఎక్సిభిటర్స్ 10 నుండి 20 శాతం నష్టాలను చూడాల్సి వచ్చింది..ఇక కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి నష్టాలు తప్పలేదు..బాహుబలి 2 సినిమా అప్పటి మార్కెట్ కి అనుగుణంగా భారీ స్థాయి బిజినెస్ చేసినప్పటికీ కూడా దానికి ఒక్క ప్రాంతం లో కూడా నష్టం రాలేదు..కానీ #RRR కి మాత్రం గట్టి దెబ్బ పడింది అనే చెప్పాలి..కానీ ఈ సినిమా నైజం మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో బయ్యర్లకు భారీ స్థాయి లాభాల్ని తెచ్చిపెట్టింది..నైజం ఏరియా లో ఈ సినిమా 75 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యగా అక్కడ ఇప్పటి వరుకు ఈ సినిమా 110 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ షేర్ ని వసూలు చేసింది..అంటే దాదాపుగా 36 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట..అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల రూపాయలకు జరగగా అక్కడ దాదాపుగా 100 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి బయ్యర్లకు 40 కోట్ల రూపాయిల లాభాల్ని తెచ్చిపెట్టింది..మొత్తం మీద ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ కూడా ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కొన్ని మాస్ సెంటర్స్ లో భారీ నష్టాలను మిగిలించింది అనే చెప్పాలి.

    Also Read: RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

    Tags