Short Films Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు రకరకాల సినిమాలు తీస్తూ హీరోలుగా మంచి గుర్తింపును తెచ్చుకుంటూ ముందుకు వెళుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమధ్య కొంతమంది షార్ట్ ఫిలింలు తీసి హీరోలుగా ఇండస్ట్రీకి వస్తున్నారు వాళ్ళల్లో కొంతమంది ప్రస్తుతం మంచి హీరోలుగా కూడా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు.అలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీ కి వచ్చి మంచి సక్సెస్ సాధించిన హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు ఈయన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేసి ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు…ఈయన హీరో గా చేసిన మొదటి సినిమా అయిన రాజా వారు రాణి గారు అనే సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యానర్లు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఈయనతో పాటుగా షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందిన హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే వరుసగా మంచి హిట్లు సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఇయాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో వరుసగా సూపర్ హిట్లను అందుకున్నాడు.
ఈ మూడు సినిమాలు ఆయన ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చాలావరకు హెల్ప్ అయ్యాయి అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో తిరగబడరా సామి అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.ఇక తొందరలోనే రిలీజ్ కూడా రెడీ అవుతుంది… షార్ట్ ఫిలిం నుంచి వచ్చి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపుని తెచ్చుకొని ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికీ వాళ్లలో వీళ్లిద్దరూ ఇద్దరు ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి.ఇక ప్రస్తుతం వీళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ హిట్ట మీద హిట్లు కొడుతూ స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…