Venkatesh-Rajendra Prasad : ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా అవతరించాడు. ఇక ఆయన అదే ఫార్మాట్ లో ముందుకు సాగుతూ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఒకప్పుడు మంచి విజయాలను సాధిస్తూ టాప్ హీరోగా వెలుగొందాడు. ఇక ఇప్పటికీ ఆయన మంచి సినిమాలను చేయడానికే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఫ్యామిలీ ఆడియన్స్ ని మరోసారి థియేటర్ కి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సంక్రాంతికి అయిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. మరోసారి సంక్రాంతి పండుగను రెట్టింపు చేసే విధంగా తన కామెడీతో ప్రేక్షకులందరిని నవ్వించడమే కాకుండా వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకునే నటనను కనబరచడానికి తను సిద్ధమయ్యాడు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒకప్పుడు వెంకటేష్ రాజేంద్రప్రసాద్ మధ్య ఒక చిన్న గొడవ జరిగిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. చంటి సినిమా విషయంలో వీళ్ళిద్దరికీ తీవ్రమైన మనస్పర్ధలైతే వచ్చాయట…తమిళంలో వచ్చిన చిన్న తంబీ సినిమాను చంటి పేరుతో రాజేంద్రప్రసాద్ తెలుగు లో రీమేక్ చేయాలని అనుకున్నాడు.
కానీ అప్పటికే ఈ సినిమా రైట్స్ ని రామానాయుడు తీసుకున్నానని చెప్పడంతో వెంకటేష్ ను పెట్టి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సందర్భంలో రాజేంద్రప్రసాద్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారట. ఇక వెంకటేష్ తో కూడా చాలా రోజులపాటు మాట్లాడలేదనే వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి…
ఇక ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వెంకటేష్ కి నంది అవార్డుతో పాటు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక అప్పటివరకు వెంకటేష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. కానీ ఒక్కసారిగా చంటి లో అమాయకపు పాత్రను పోషించి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా వెంకటేష్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక వెంకటేష్ కెరియర్ లో టాప్ 5 సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వెంకటేష్ తన ఎంటైర్ కెరియర్ లో విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఆ పాత్రల్లో కూడా సక్సెస్ ఫుల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం…