అరె.. ‘నట సింహం’లో మార్పు వచ్చింది !

యువరత్న నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. అయితే బాలయ్య అంటేనే.. ఒన్లీ యాక్షన్, పైగా బాలయ్య సినిమాలు ఆయన అభిమానులకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు బాలయ్య మారాడు. తన సినిమాలను కూడా మార్చబోతున్నాడు. కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చిందని, ఇక నుండి బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా […]

Written By: admin, Updated On : June 10, 2020 7:26 pm
Follow us on


యువరత్న నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. అయితే బాలయ్య అంటేనే.. ఒన్లీ యాక్షన్, పైగా బాలయ్య సినిమాలు ఆయన అభిమానులకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు బాలయ్య మారాడు. తన సినిమాలను కూడా మార్చబోతున్నాడు. కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చిందని, ఇక నుండి బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఇక పై తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు క్లారిటీగా చెప్పారట. తనకు కథ చెప్పాలనుకుంటే కొత్తదనం ఉండాలని, అప్పుడే కథ చెప్పడానికి రండని అన్నారట. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని బాలయ్య బలంగా కోరుకుంటున్నారట. అందుకే బోయపాటి సైతం బాలయ్య అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేయించాల్సి వచ్చింది.

మెయిన్ గా బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశారు బోయపాటి. మొత్తానికి బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. మరి బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో.. అందర్నీ బాలయ్య ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.