Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్… డైరెక్టర్స్ ఎలాంటి జానర్స్ లో సినిమాలు చేసిన కూడా అల్టిమేట్ గా ప్రేక్షకులను మెప్పించిన వాళ్లు మాత్రమే స్టార్ డైరెక్టర్లుగా మారతారు. కమర్షియల్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టిన వాళ్లే నెంబర్ వన్ పొజిషన్ కి అర్హులుగా మారుతారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ లాంటి దర్శకుడు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను థియేటర్ కి రప్పిస్తున్నారు. ఒకప్పుడు లెక్కల మాస్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ప్రేక్షకుడి యొక్క ఐక్యూ లెవల్ ను టెస్ట్ చేస్తూ సినిమాలను చేశాడు. కానీ అవి కొంచెం తేడా కొట్టడంతో ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమాలను మాత్రమే చేయాలని అనుకున్నాడు. అందుకే రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలను చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో పాన్ ఇండియా లో తను టాప్ 3 డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు. మొత్తానికైతే సుకుమార్ స్టాండర్డ్ ని అందుకోవడం ఇప్పుడున్న దర్శకులకు చాలా కష్టమనే చెప్పాలి.
ఆయన సినిమా సినిమాకి వేరియేషన్స్ ను చూపిస్తూ క్యారక్టరైజెషన్స్ లో సైతం కొత్తదనాన్ని చూపిస్తూ సినిమాని ఎలా నడిపించాలో కూడా చెబుతున్నాడు. ముఖ్యంగా సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తన సినిమాలోని క్యారెక్టరైజేషన్ ద్వారా సినిమా మొత్తాన్ని మలుపు తిప్పుతాడు. అందువల్లే అతని సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ అయితే ఉంది.
ఇక సుకుమార్ లాంటి సినిమాలను చేయగలిగే దమ్మున్న దర్శకుడు ఇండస్ట్రీలో మరెవరు లేరా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…నిజానికి సుకుమార్ ను ఢీకొట్టడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్జేషన్స్ లో డెప్త్ ను చూపిస్తాడు. ప్రతి సీన్లో ఒక సినిమా తాలూకు రిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది.
అందువల్లే సుకుమార్ ని ఆరాధించే అభిమానుల సంఖ్య ఎక్కువైపోయింది. ఇక సుకుమార్ సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులు కూడా ఎక్కువయ్యారు… ఇక ఆయన లాంటి సినిమాలను చేసే దర్శకులు ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే ఎవ్వరు లేరు. ఫ్యూచర్ లో ఎవరైనా వస్తారా? లేదా అనేది చూడాలి…