Anchor Anasuya: సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

అనసూయ మాట్లాడుతూ.. ‘‘దర్జా మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. అల్లు అరవింద్‌గారు, వెంకటేష్‌గారు, సురేష్‌బాబుగారు, రాఘవేంద్రరావుగారు, నవీన్ ఎర్నేనిగారు, బుచ్చిమాయ్య.. వీరంతా ‘దర్జా’ టీమ్‌కు ఎంతో సపోర్ట్ అందించారు.

ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు ప్రభుగారు, మరొకరు షకీల్‌గారు. నేను షకీల్‌గారిని సంగీత దర్శకుడు అని అనుకోలేదు. నిర్మాత అనుకున్నాను.

ఎందుకంటే ప్రతీది తను దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిగారు ఒక బ్యాంకర్‌లా కనిపించేవారు. ఈ పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలైన బ్రదర్స్ ఎంతగానో సినిమా కోసం కష్టపడ్డారు.

ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. అలాగే సినిమాను తీశారు. శివశంకర్‌గారికి, రవిగారికి థ్యాంక్యూ. అలాగే కామినేని శ్రీనివాస్‌గారు ఎంతో సపోర్ట్ ఇస్తూ వచ్చారు. దర్శకుడు మాక్.. ఎప్పుడూ కంగారుగా ఉండేవారు.

ఇప్పుడు కాస్త వైట్ డ్రస్సులో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కనకం పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఈ సినిమాకు పని చేసిన సునీల్ గారు, శిరీష, అక్సా, షమ్ము, సమీర్, షఫీ ఇలా అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎందరో ఈ సినిమాలో నటించారు.. అందరికీ ఆల్ ద బెస్ట్. డిఓపీ దర్శన్‌గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.

అలాగే అంజి మాస్టర్‌కి థ్యాంక్యూ. ఈ సినిమాలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. జోక్స్ పార్ట్ పక్కన పెడితే.. ఇది అద్భుతమైన సినిమా. థియేటర్లకి వచ్చి ఈ సినిమాని చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేయకండి. థియేటర్‌లో జూలై 22న వస్తున్న ఈ సినిమా చూడండి. థ్యాంక్యూ ఆల్’’ అని అన్నారు.
