Homeఎంటర్టైన్మెంట్Radhe shyam: రాధేశ్యామ్​ సినిమా క్లైమాక్స్​కు అన్ని రూ.కోట్లు ఖర్చా!

Radhe shyam: రాధేశ్యామ్​ సినిమా క్లైమాక్స్​కు అన్ని రూ.కోట్లు ఖర్చా!

Radhe shyam: యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ హీరోగా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్​. రాధాకృష్ణ దర్శత్వంలో పీరియాడిక్​ లవ్​ స్టారీ ఈ సినిమా. సంక్రాంతి కానుకగా జనవరి14న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. పూడా హెగ్డే హీరోయిన్​గా  కనిపించనుంది. అయితే, తాజాగా,  ఈ సినిమా క్లైమాక్స్​పై పలు ఆసక్తికర విషయాలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సినిమా మొత్తానికి ఒక్క చివరి సీన్​కే నిర్మాతలు 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, దాదాపు 15 నిమిషాలు నిడివితో క్లైమాక్స్​ ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రేక్షకుల మనసును కదిలించే  విధంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్​.

 

there-is-buzz-about-radheshyam-movie-the-makers-spent-rs-50-crore-for-climaxమరోవైపు అక్టోబరు 23న ప్రభాస్​ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్​ను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తూ.. ఆసక్తి పెంచుకున్నారు చిత్రయూనిట్​. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ నుంచి ఓ పోస్టర్​ విడుదలైంది. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఉదయం 11:16 గంటలకు టీజర్ రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్​లో ఉండే ఈ టీజర్​తో పాటు అన్ని భాషల సబ్​టైటిల్స్​ రానున్నాయి. ‘హూ ఈజ్ విక్రమాదిత్య’ అనే క్యాప్షన్​తో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

1970ల నాటి వింటేజ్ ప్రేమకథతో ‘రాధేశ్యామ్’ సినిమా తీశారు. జగపతిబాబు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.’బాహుబలి’తో ఎన్నో రికార్డులు సాధించిన ప్రభాస్.. ఈ సినిమాతో ఇంకెన్ని ఘనతలు సాధిస్తారో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular