Megastar Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 150 కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకుల్లోనే కాకుండా యూత్ లోనూ ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలో అయినా హీరోలు మొత్తంగా యాభై సినిమాలు చేస్తే గ్రేట్ అనే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో చిత్రానికి రెండేళ్ల నుంచి మూడేళ్ల సమయం తీసుకోవడంతో యంగ్ జనరేషన్ హీరోలు ఐదేళ్ల వ్యవధిలో కేవలం రెండు లేదా మూడు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అయితే ఈ జనరేషన్ లో 150 కి పైగా సినిమాల్లో నటించిన ఏకైక హీరో చిరు అని చెప్పుకోవచ్చు.. అంతేకాదు ఆయన రికార్డును బ్రేక్ చేయడం కూడా సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే మెగాస్టార్ చిరు తన కెరీర్ మొదటిలో ఎక్కువగా సినిమాలు చేయడం వలనే ఆయనకు ఈ రికార్డు సాధ్యమైందని తెలుస్తోంది. గతంలో హీరోలు నెలకు ఒక సినిమాను పూర్తి చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. షూటింగ్ ను ఎంత స్పీడ్ గా పూర్తి చేసినా ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేయడం కూడా కష్టంగా ఉంది. ఈ కారణంగా చిరు రికార్డ్ ను ప్రస్తుతం ఉన్న హీరోలు బ్రేక్ చేయలేరని చెప్పుకోవచ్చు.
కాగా చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీబిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు యంగ్ జనరేషన్ హీరోలకు తన సినిమాల్లో ఛాన్స్ ఇస్తూ అభిమానులకు చిరు మరింతగా చేరువ అవుతున్నారని చెప్పుకోవచ్చు.