Samanyudu Movie: తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. పందెం కోడి, పందెం కోడి 2, అభిమన్యు, డిటెక్టివ్ వంటి సినిమాలు తెలుగులో కూడా ఘన విజయం సాధించాయి. ఈ విధంగా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విశాల్. హిట్లు ప్లాప్పులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. ఇటీవలే ఎనిమి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఇక విశాల్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’. ఈ చిత్రంతో శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉప శీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. విశాల్ గత చిత్రాలకు పని చేసి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థీమ్ మ్యూజిక్‌ను మూవీ యూనిట్ విడుదల చేశారు. ఇందులోని లిరిక్స్ ఎంతో స్పూర్తివంతంగా ఉన్నాయి. కాగా డింపుల్ హయతి ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కెవిన్ రాజా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ థీమ్ మ్యూజిక్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
Here's our #VeeramaeVaagaiSoodum Theme Music #1 – #RiseOfACommonMan Composed by @thisisysr. GB
▶️ https://t.co/hkl4chzQok#Saamanyudu #വീരമേവാകൈസൂടും #ThemeMusic #VVS@Thupasaravanan1 @DimpleHayathi @iYogiBabu @johnsoncinepro @UrsVamsiShekar @HariKr_official pic.twitter.com/FAsTeErueN
— Vishal (@VishalKOfficial) December 22, 2021