Theaters shutdown : జూన్ 1 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూతపడనున్నాయా?, బయ్యర్స్ డిమాండ్స్ కి నిర్మాతలు ఒప్పుకునే వరకు థియేటర్స్ ని తెరిచే అవకాశమే లేదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల బయ్యర్స్ నిర్మాతలను మాకు కమీషన్ బేసిస్ మీదనే అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈమధ్య కాలం లో విడుదలయ్యే సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. థియేటర్స్ నడపలేని పరిస్థితి ఏర్పడింది. అత్యధిక శాతం మంది థియేటర్స్ ఓనర్లు రెంటల్ బేసిస్ మీదనే నడుపుతున్నారు. కానీ బయ్యర్స్ మాత్రం కమీషన్ బేసిస్ మీద నడపాలని ఒత్తిడి చేస్తున్నారు. కమీషన్ బేసిస్ అంటే థియేటర్స్ ద్వారా వచ్చిన గ్రాస్ లో వాటా తీసుకోవడం. రెంటల్ అంటే గ్రాస్ తో సంబంధం లేదు, పది టికెట్స్ అమ్ముడుపోయినా, ముందుగా బయ్యర్ ఇస్తానన్న రెంట్ ఇవ్వాల్సిందే.
Also Read : పెద్ది’ లో ఐటెం సాంగ్ కోసం పూజా హెగ్డే భారీ రెమ్యూనరేషన్..డిమాండ్ అసలు తగ్గలేదుగా!
ఈ రెంటల్ విధానంకి బయ్యర్స్ సుముఖత చూపించడం లేదు. దీనిపై థియేటర్స్ యాజమాన్యాలతో వచ్చే నెల 1 న చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత నిర్మాతలతో కూడా ఈ అంశంపై చర్చించి, సఫలం అయితే థియేటర్స్ కొనసాగిస్తారు, లేకపోతే మూసేస్తారు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది. అసలే థియేటర్స్ ఖాళీగా పడున్నాయి. రాక రాక ‘హరి హర వీరమల్లు’ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం వస్తుంది. ఇక మంచి రోజులు రాబోతున్నాయి అని అంతా అనుకుంటున్న సమయంలో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను కుదిపేస్తోంది. అయితే ఈ సమస్య ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా విడుదల అయ్యేలోపు సర్దుకుంటుందని, ఆ చిత్రాలకు ఎలాంటి ఆటంకం ఉండడం అంతా అంటున్నారు. అదే కనుక నిజమైతే బాగుంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు తీవ్రమైన నిరాశే ఎదురు అవుతుంది. చాలా కాలం తర్వాత వస్తున్న పెద్ద హీరో సినిమా, అది కూడా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా పని చేస్తున్న వ్యక్తి సినిమా.
కాబట్టి విడుదల సమయానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత ఇండస్ట్రీ బాగా డల్ అయ్యింది. తండేల్, డ్రాగన్ , హిట్ 3 , సింగిల్ వంటి సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. నాలుగు నెలల్లో కేవలం నాలుగు హిట్స్ అంటే ఇండస్ట్రీ ఎలా నడుస్తుంది చెప్పండి?. పైగా ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా బయ్యర్స్ ని చావు దెబ్బ కొడుతోంది. ఇలాంటి సమయంలో బయ్యర్స్ అలాంటి నిర్ణయం తీసుకోవడం లో కూడా ఎలాంటి తప్పు లేదు. ‘హరి హర వీరమల్లు’ కి అత్యధిక ప్రాంతాల్లో కమీషన్ బేసిస్ మీద అమ్మమని నిర్మాతపై ఒత్తిడి చేస్తున్నారట. ఉదాహరణకు నైజాం ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడం కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా కమీషన్ బేసిస్ మీదనే కొనాలని చూస్తున్నారు.