కరోనా.. లాక్డౌన్ ఎఫెక్ట్ తో గడిచిన ఆరునెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. అయితే తాజాగా కేంద్రం ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. 50శాతం అక్యుపెన్సీతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం గైడ్ లైన్స్ విధించింది. ఈమేరకు థియేటర్లు సైతం ఓపెనింగ్ కోసం రెడీ అవుతున్నాయి.
Also Read: టీజర్ టాక్: నందు-రష్మి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’యేనా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కరోనా తగ్గలేదు. ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కన్పించడం లేదు. దీంతోపాటు గత ఆరునెలలు థియేటర్లు మూతపడటంతో సినిమా ప్రేక్షకులంతా ఓటీటీల అలవాటుపడిపోయారు. చిన్నసినిమాలతోపాటు పెద్ద సినిమాలు కూడా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రం విడుదలై ఆయనకు మంచి లాభాలను తెచ్చింది.
దీంతో అగ్ర నిర్మాతలు కూడా ఓటీటీల్లో సినిమాలను రిలీజ్ చేసేందుకు వెనుకడం లేదు. తాజాగా అనుష్క నటించిన ‘నిశబ్దం’.. రాజ్ తరుణ్ నటించిన ‘బుజ్జిగాడు’ మూవీ ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. వీటితోపాటు సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’.. ‘గుడ్ లక్ సఖి’.. ‘మిస్ ఇండియా’ సినిమాలు లైన్లో ఉన్నాయి.
ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. కరోనాకు ముందుగానే చిరంజీవి అల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’.. రామ్ హీరోగా నటించిన ‘రెడ్’ మూవీలు పూర్తయ్యాయి. వీటి విడుదల సమయానికి కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్టాయి. ఆ తర్వాత ఓటీటీల్లో ఈ సినిమాలు వస్తాయని భావించారు. అయితే ఈ వార్తలను నిర్మాతలు ఖండించారు.
Also Read: ముహుర్తం ఫిక్స్.. మహేష్, పవన్ రికార్డులను బ్రేక్ చేయనున్న ప్రభాస్..!
ఈ రెండు చిత్రాలు థియేటర్లలో రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉప్పెన’ చిత్రం వైష్ణవ్ తేజ్ కు డబ్ల్యూ మూవీ కావడంతో ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు మొగ్గుచూపడం లేదు. నష్టం వచ్చినా సరే థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ఆగింది. అదేవిధంగా రామ్ ‘రెడ్’ మూవీ రిలీజ్ కు ముందే డబ్బింగ్.. శాటిలైట్ హక్కులతో పెట్టుబడి మొత్తం రాబట్టిందట. దీంతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
అయితే థియేటర్లు ఓపెన్ కాగానే ఈ సినిమాలు వచ్చేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయిన నెల తర్వాతగానీ ఈ చిత్రాలు రావనే టాక్ విన్పిస్తోంది. దీంతో థియేటర్లు కొత్త సినిమాల కోసం ముస్తాబైనా ఫలితం లేకుండా పోతుంది. నిర్మాతల భయం కారణంగా సినిమాలు మరింత ఆలస్యం అవడం ఖాయం కన్పిస్తోంది.