రేపే విడుద‌ల‌.. థియేట‌ర్ల‌లో రెండు సినిమాలు!

క‌రోనా దెబ్బ‌కు ఏప్రిల్ లో మూత‌ప‌డిన థియేట‌ర్లు.. మ‌ళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోబోతున్నాయి. ఈ శుక్ర‌వారం రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ దృష్టి మొత్తం ఈ సినిమాల‌పైనే ఉంది. ఈ రెండు చిత్రాల రిపోర్టుపైనే టాలీవుడ్ మొత్తం ఒక నిర్ణ‌యానికి రానుంది. సినిమాల విష‌యంలో జ‌నాల అభిప్రాయం ఎలా ఉంది? థియేటర్ కు వెళ్లడానికి ఎంత వ‌ర‌కు రెడీగా ఉన్నారు? క‌లెక్ష‌న్ కెపాసిటీ ఎంత‌? అనే అన్ని అంశాల‌పై ఓ క్లారిటీ రానుంది. ఆ […]

Written By: Bhaskar, Updated On : July 29, 2021 10:48 am
Follow us on

క‌రోనా దెబ్బ‌కు ఏప్రిల్ లో మూత‌ప‌డిన థియేట‌ర్లు.. మ‌ళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోబోతున్నాయి. ఈ శుక్ర‌వారం రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ దృష్టి మొత్తం ఈ సినిమాల‌పైనే ఉంది. ఈ రెండు చిత్రాల రిపోర్టుపైనే టాలీవుడ్ మొత్తం ఒక నిర్ణ‌యానికి రానుంది. సినిమాల విష‌యంలో జ‌నాల అభిప్రాయం ఎలా ఉంది? థియేటర్ కు వెళ్లడానికి ఎంత వ‌ర‌కు రెడీగా ఉన్నారు? క‌లెక్ష‌న్ కెపాసిటీ ఎంత‌? అనే అన్ని అంశాల‌పై ఓ క్లారిటీ రానుంది. ఆ త‌ర్వాత‌నే త‌మ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేసుకునే అవ‌కాశం ఉంది.

ఈ శుక్ర‌వారం రాబోతున్న రెండు సినిమాల్లో ఒక‌టి స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన ‘తిమ్మరుసు’. మరొకటి తేజ సజ్జా హీరోగా వస్తున్న ‘ఇష్క్’. ఇవి రెండూ చిన్న సినిమాలే అయినా.. క‌థాబ‌లం ప‌టిష్టంగా ఉన్న‌విగా ప్ర‌చారంలో ఉన్నాయి. సెకండ్ వేవ్ లో మూత‌ప‌డిన థియేట‌ర్ల‌ను తెరిపించి, జ‌నాల‌ను ర‌ప్పించడం అంటే సాధార‌ణ విష‌యం కాదు. అది కూడా.. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్న వేళ ఆషామాషీ కాదు. అందుకే.. ఈ రెండు చిత్రాల మేకర్స్ ప్ర‌చార‌మైతే భారీగానే చేస్తున్నారు.

జ‌నాల మూడ్ ఎలా ఉంది? అన్న‌ది ఒక టెన్ష‌న్ అయితే.. ఏపీలో సినిమా థియేట‌ర్ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డం మ‌రో ఇబ్బంది. తెలంగాణ‌లో 100 శాతం ఆక్యుపెన్సీ ఉంది. థియేట‌ర్లు కూడా పూర్తిగా తెరుచుకునే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా.. థియేట‌ర్ల‌లో పార్కింగ్ చార్జీలు సైతం వ‌సూలు ఏసుకునేందుకు థియేట‌ర్ల‌కు అవ‌కాశం ఇస్తూ జీవోను సైతం ఇచ్చింది స‌ర్కారు. కాబ‌ట్టి.. ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేదు. కానీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మాత్రం ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఉంది.

ఏపీలోని సినిమా థియేట‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్ర‌మే అమ‌ల్లో ఉంది. అంతేకాదు.. నైట్ షోలు కూడా లేవు. ఇక‌, వ‌కీల్ సాబ్ స‌మ‌యంలో హ‌డావిడిగా టికెట్ రేట్లు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న స‌ర్కారు.. ఆ త‌ర్వాత ఏమీ మాట్లాడ‌లేదు. ఇలాంటి కార‌ణాల‌తో సీ సెంట‌ర్ల‌లో థియేట‌ర్లు తెరుకోవ‌ట్లేదు. బీ సెంట‌ర్లు కూడా చాలా వ‌ర‌కు డౌటే. అస‌లే.. 50 శాతం ఆక్యుపెన్సీ, పైగా నైట్ షోలు లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో థియేట‌ర్లు ఓపెన్ చేసుకొని ఏం చేయాలి? అనే ఆలోచ‌న‌లో ఉన్నారు ఎగ్జిబిట‌ర్లు. ఏ సెంట‌ర్లు అన్నీ తెరుచుకుంటాయా? అన్న‌ది చూడాల్సిన విష‌యం. కేవ‌లం మ‌ల్టీ ఫ్లెక్స్ లు మాత్ర‌మే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. మ‌రి, ఇలాంటి ప‌రిస్థితుల్లో రిస్క్ చేసి మ‌రీ విడుద‌ల‌వుతున్న రెండు సినిమాలు ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటాయోని ఇండ‌స్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది.