https://oktelugu.com/

Young Hero Divorce : యంగ్ హీరోకి అంగస్తంభన సమస్య వల్ల విడాకులు ఇవ్వబోతున్న భార్య

ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈయన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్ళై ఇన్నాళ్లు అయినా ఆయనకీ పిల్లలు పుట్టకపోవడానికి కారణం, అంగస్తంభన సమస్య వల్లేనని,

Written By: , Updated On : June 23, 2023 / 08:37 PM IST
Follow us on

Young Hero Divorce : ఎల్లప్పుడూ సెలబ్రిటీస్ మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ నెటిజెన్స్ చేత తిట్టించుకొని అయినా ఫేమస్ అవుదామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో ఒకడే ఉమర్ సందు. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని, నోటికి ఏది వస్తే అది మాట్లాడే రకం ఈయన. ఆయనకీ తెలిసింది గోరంత, తెలియనిది కొండంత అని నెటిజెన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ మనిషికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇప్పటి వరకు ఇతగాడు చెప్పినవి ఒక్కటి కూడా నిజం కాలేదు.

గతంలో ఇతను మూవీస్ కి విడుదలకు ముందే నేను చూసేసానని, సినిమా అద్భుతంగా వచ్చిందంటూ రివ్యూలు ఇచ్చేవాడు. ఆయన అలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. దీనితో ఆయనని పట్టించుకోవడం మానేశారు జనాలు. ఇక పాజిటివ్ న్యూస్ లు ఇస్తుంటే పని అవ్వడం లేదని నెగటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసాడు. అప్పటి నుండి ఇతనికి మళ్ళీ రీచ్ పెరిగింది.

 

ఇప్పుడు రీసెంట్ గా ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈయన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్ళై ఇన్నాళ్లు అయినా ఆయనకీ పిల్లలు పుట్టకపోవడానికి కారణం, అంగస్తంభన సమస్య వల్లేనని, అందుకే అతనికి పిల్లలు పుట్టడం లేదని, ఈ విషయం లో కత్రినా కైఫ్ తో ప్రతీ రోజు గొడవలే అని, ఇప్పుడు ఆమె భరించలేక విడాకులు తీసుకోవడానికి సిద్దపడింది అంటూ ఒక ట్వీట్ వేసాడు.

దేనికైనా ఒక పరిమితి అనేది ఉంటుంది. ఈ ఉమర్ సందు అనే అతను ఆ పరిమితిని దాటేసి, అతి నీచంగా సెలెబ్రిటీలను వ్యక్తిగతంగా పుకార్లు పుట్టి ఉంచడం ప్రారంభించాడు. ఇతను కచ్చితంగా శిక్షార్హుడే, కానీ ఎందుకు అతనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.