Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మాత్రం విపరీతమైన అంచనాలు అయితే ఉంటాయి. ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా వరుస సినిమాలని చేస్తు వస్తున్నాడు. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలియాలంటే ఆయన సినిమా రిలీజ్ రోజు చూస్తే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ డైరెక్టర్లకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారు.
కానీ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలంటే ఆ దర్శకుడు కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. క్రమశిక్షణ, హార్డ్ వర్క్ చేసే గుణం, నిబద్ధత, సినిమాని సరిగ్గా హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుంది. ఇక అందువల్లే అప్ కమింగ్ డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ తో ఈజీగా సినిమా చేయొచ్చని అతనికి కథలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒకరిని నమ్మాడు అంటే వాళ్ళని బ్లైండ్ గా నమ్మేస్తాడు. అందువల్లే దర్శకులు పవన్ కళ్యాణ్ ని చాలా కొత్తగా చూపిస్తూ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ , సుజిత్ డైరెక్షన్ లో ‘ ఓ జి’ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో యంగ్ డైరెక్టర్ కి కూడా అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.
రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న కార్తీక్ దండు కూడా పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా ఒక కథను వినిపించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈయన ప్రస్తుతం విరూపాక్ష 2 సినిమా బిజీగా ఉన్నప్పటికీ విరూపాక్ష సినిమా సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ తో మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే దర్శకుడు ఒక లైన్ వినిపించాడు. ఇక దాంతో పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాని చేయడానికి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ కాంబినేషన్ లో ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి…