The Warrior Review: ఎనెర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా నటించిన వారియర్ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల అయ్యింది..తమిళ టాప్ డైరెక్టర్ లింగు సామి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించగా , విలన్ గా ఆదిపినిశెట్టి నటించాడు..ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం విడుదలకి ముందే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సినిమాకి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడం లో సహాయపడ్డాయి ..టీజర్ మరియు ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడం తో సినిమాకి మంచి హైప్ అయితే ఏర్పడింది..ఇక హీరో రామ్ తొలిసారి పోలీస్ గెటప్ వెయ్యడం తో ఆయన అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా థ్రిల్ కి గురైయ్యారు..అలా ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి కాస్త డివైడ్ టాక్ వచ్చింది..లింగు సామి ఇంకా కాస్త బలమైన స్క్రీన్ ప్లే తో సినిమాని తీసి ఉంటె బాగుండేది అని పబ్లిక్ నుండి వినిపిస్తున్న టాక్.

Also Read: Pavan Kalyan: విజయ్ సినిమాకి ‘నో’ చెప్పిన పవన్ కళ్యాణ్
సినిమా మొత్తం ఎలా ఉందొ ఒకసారి విశ్లేషిస్తే హీరో రామ్ పవర్ ఫుల్ యాక్షన్ తో ఎప్పటిలానే అదరగొట్టేసాడు..ఇక సాంగ్స్ లో కూడా ఊహించినట్టే అదిరిపొయ్యే స్టెప్స్ వేసాడు..మాస్ ఆడియన్స్ కి అది ఫీస్ట్ లాగ అనిపిస్తాయి..ఇక ఈ సినిమాలో విలన్ గా చేసిన ఆది పెట్టి శెట్టి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి..సినిమా ఫస్ట్ హాఫ్ ని సగం నిలబెట్టేసాడు..స్టోరీ మొత్తం రామ్ మరియు ఆది మధ్య జరగడం తో వల్ల సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు డైరెక్టర్..ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది..మాస్ ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చుతుంది..కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు బాగా లాగ్ అనిపిస్తాయి..ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అయితే బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది..కొన్ని సీన్స్ సినిమాలో అద్భుతంగా పేలాయి..కానీ దానికి తగట్టు దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు..ఆయన సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఉంటె ఆ సన్నివేశాలు అన్ని వేరే లెవెల్ కి వెళ్ళేవి అని చెప్పొచ్చు..ఇక హీరోయిన్ కృతి శెట్టి రోల్ అంతంత మాత్రమే అని చెప్పొచ్చు..కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది ఆమె..మొత్తానికి సినిమా మాస్ ఆడియన్స్ కి పక్కా నచుతుంది..సాంగ్స్ కూడా ఆన్ స్క్రీన్ అదిరిపోయాయి..గడిచిన కొన్ని వారల నుండి వరుసగా చెత్త సినిమాలను చూసి విసుగెత్తిపోయిన ఆడియన్స్ కి ఈ వారియర్ సినిమా ఈ వీకెండ్ కాస్త రిలీఫ్ ఇస్తుంది అని చెప్పొచ్చు.
రేటింగ్ : 2.75/5
Also Read: Ram Gopal Varma Shiva Movie: శివ సినిమా కూడా కాపీయేనా? వర్మ సినిమా గురించి బయటకొచ్చిన లీక్
[…] Also Read: The Warrior Review: ‘ది వారియర్’ మూవీ రివ్యూ […]
[…] Also Read: The Warrior Review: ‘ది వారియర్’ మూవీ రివ్యూ […]
[…] Also Read: The Warrior Review: ‘ది వారియర్’ మూవీ రివ్యూ […]