Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగొచ్చు. ఒక్క సంఘటనతో ఫేమస్ కావచ్చు అదే సమయంలో వ్యతిరేకతకు గురికావచ్చు. హౌస్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన గమనిస్తూ ఉండే ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. ఈ వారం ఎలిమినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా… ఓటింగ్ రోజురోజుకూ మారిపోతుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చన్న మాట వినిపిస్తోంది.
బిగ్ బాస్ సీజన్ 7 తొలివారం నామినేషన్స్ లిస్ట్ లో షకీలా, దామిని, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. వీరిలో సామాన్యుడు కోటాలో అడుగుపెట్టిన రైతుబిడ్డ టాప్ లో దూసుకుపోతున్నాడట. పల్లవి ప్రశాంత్ కి భారీగా ఓట్లు పడుతున్నాయట. నెక్స్ట్ రతికా రోజ్ ఉన్నారట. నిన్నటి వరకు శోభా శెట్టి రెండో స్థానంలో ఉంది. రతికా రోజ్ ఆమెను వెనక్కి నెట్టడంతో శోభా శెట్టి మూడో స్థానానికి పడిపోయిందట.
ఇక నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో షకీలా, ఆరో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడట. మొదట్లో ప్రిన్స్ యావర్ చివరి స్థానంలో ఉన్నాడు. అతడు తన స్థానం మెరుగుపరుచుకుని డేంజర్ జోన్ నుండి బయటపడ్డాడు. ఇక ఏడో స్థానంలో దామిని, ఎనిమిదో స్థానంలో కిరణ్ రాథోడ్ ఉన్నదట. కాబట్టి వీరిద్దరిలో వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా కిరణ్ రాథోడ్ మొదటి వారమే హౌస్ ని వీడవచ్చు. ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను కిరణ్ రాథోడ్ ఊపేసింది. కాగా బిగ్ బాస్ సీజన్ 7 కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ఈ క్రమంలో మరికొంత మంది మధ్యలో జాయిన్ కావచ్చు. ఈ సీజన్లో 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కొందరు తప్పుకున్నారనే వాదన ఉంది…