Game Changer
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అడుగడుగునా కష్టాలే. మూడేళ్లు కష్టపడి తెరకెక్కించిన సినిమాని హీరో, నిర్మాత, డైరెక్టర్ ముగ్గురు పట్టించుకోవడం మానేశారు. ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ దర్శక నిర్మాతలు మొదటి వారం తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ విడుదలైన రెండవ రోజు నుండే పట్టించుకోవడం మానేశారు. మొదటి రోజే ఈ సినిమాకి సంబంధించి HD ప్రింట్ ని కొంతమంది దుండగులు ఆన్లైన్ లో లీక్ చేసారు. దీనిపై నిర్మాత దిల్ రాజు కొంతమందిని అనుమానిస్తూ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కొంతమంది అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో మూవీ టీం కనీసం ‘గేమ్ చేంజర్’ కి సంబంధించి పబ్లిసిటీ పోస్టర్స్ ని విడుదల చేయడం కూడా ఆపేసింది. ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు నుండి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదలై కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది.
దీంతో నిర్మాత దిల్ రాజు ఫోకస్ మొత్తం ఆ చిత్రం వైపే పెట్టాడు. ఆ సినిమాకి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం కూడా తనదే అన్న విషయం మర్చిపోయాడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ ఫుటేజీ ఆన్లైన్ లో విడుదలైంది. ఆడియో కూడా డాల్బీ అట్మాస్ రేంజ్ క్వాలిటీ తో ఉంది. ఈ ప్రింట్ ఎడిటింగ్ రూమ్ లోని ఫైనల్ కట్ ఫుటేజీ గా గుర్తిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే ఈ సినిమాలోని అనేక సన్నివేశాలకు VFX వర్క్ ఇంకా పూర్తి చేయలేదు. కచ్చితంగా ఇది మూవీ టీం కి సంబంధించిన వారే లీక్ చేసారు. దీనిని గమనించి సోషల్ మీడియా లో అభిమానులు మూవీ టీం ని ట్యాగ్ చేసి, ఇలా HD ప్రింట్ లీక్ అయిపోయింది అని ట్యాగ్ చేయగా ఎవ్వరూ పట్టించుకోలేదు.
నిర్మాత దిల్ రాజు గత నాలుగు రోజుల నుండి ఐటీ అధికారులు తన ఇంటి పై రైడింగ్ చేస్తున్న సందర్భంగా ఆయన ఆ టెన్షన్ లో ఉన్నాడని, అందుకే పట్టించుకోవడం లేదని కొంతమంది అంటుంటే, ఐటీ రైడింగ్స్ ఒక పక్క జరుగుతున్నప్పటికీ దిల్ రాజు టీం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సెలెబ్రేషన్స్ ఈవెంట్స్ తో దూసుకుపోతుంది కదా, ఆ మాత్రం ద్రుష్టి ‘గేమ్ చేంజర్’ పై పెట్టలేరా?, ఓటీటీ లో విడుదలయ్యే ప్రింట్ ఎంత క్వాలిటీ తో ఉంటుందో, ‘గేమ్ చేంజర్’ ప్రింట్ ఆ రేంజ్ క్వాలిటీ తో బయటకి వచ్చింది, కనీసం మూవీ టీం లో ఎవరైనా స్పందించండి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దీనిని బట్టి చూస్తే ఈ చిత్రం పట్ల నిర్మాతలకు ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరో మూడేళ్ళ విలువైన సమయానికి వీళ్ళు ఇస్తున్న విలువ ఇంతే.