Two Star Heros Rejected: అక్కినేని నాగార్జున – అన్నమయ్య చిత్రానికి ముందు నాగార్జున అంటేనే రొమాంటిక్ సినిమాల హీరో. పైగా అప్పటి అమ్మాయిలకు ఫేవరేట్ హీరో. అలాంటి నాగార్జున ఓ భక్తుడు పాత్రలో నటించి తనకు తానే ఆశ్చర్యపోయేలా ఆ పాత్రలో నాగ్ ఒదిగిపోయారు. ముఖ్యంగా ఒక్క అంతర్యామి సన్నివేశం చాలు, నాగార్జున ఎంతటి వైవిధ్యమైన పారవశ్యంలోకి వెళ్లిపోయారో అర్థమవుతుంది.

తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుడిగా అన్నమయ్య నాగార్జున జీవించేశాడు. అయితే, ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం రాఘవేంద్రరావు చాలా కసరత్తులు చేశారు. ముందు స్టార్ హీరోలను అనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరోలు ? ఎందుకు స్టార్ హీరోలు కోసమే ట్రై చేశారు తెలుసుకుందాం. వెంకటేశ్వరుడి భక్తుడిగా నాగార్జున ఆయన పాదాలపై పడే సీన్లు ఉన్నాయి.
పైగా ఈ సీన్లు సినిమాలో చాలా కీలకం. అందుకే వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా సీనియర్ స్టార్ హీరో శోభన్‌బాబును అడిగారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అంటే శోభన్‌బాబుకి బాగా ఇష్టం. కాబట్టి.. సినిమా ఒప్పుకుంటారు అని అనుకున్నారు అంతా. కానీ అప్పటికే సినిమాలకు దూరమైపోయాను ఇక చేయలేను అంటూ శోభన్‌బాబు ఈ సినిమా అంగీకరించలేదు.

అయినా ఆయన పై ఎక్కువ ఒత్తిడి తెస్తే.. కావాలని శోభన్ బాబు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారట. అంత డబ్బు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో శోభన్ బాబును పక్కన పెట్టారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం బాలయ్య అయితే బాగుంటారు అనిపించింది. బాలయ్యను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల బాలయ్య ఈ సినిమా చేయలేదు.
దానికి తోడు ఫ్యాన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుందో ? అన్న సందేహంతో రాఘవేంద్రరావే మళ్లీ వెనక్కు తగ్గాడు. చివరకు సుమన్ దగ్గరకు ఈ పాత్ర వెళ్ళింది. సుమన్‌ను పిలిపించి కథ చెప్పారు. ఫొటో షూట్ కూడా చేశారు. సుమన్ ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారని అనిపించింది. అలా వెంకటేశ్వర స్వామిగా సుమన్ కనిపించారు. తన నటనతో సినిమా విజయంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర ఇప్పటికీ అలా చెక్కు చెదరకుండా నిలిచిపోయింది.
Recommended Videos: