https://oktelugu.com/

Game Changer Movie :గేమ్ చేంజర్  చిత్రంలో అంజలి క్యారెక్టర్ ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు..శంకర్ కెరీర్ లోనే బెస్ట్ క్లైమాక్స్ లోడింగ్!

ప్రముఖ హీరోయిన్ అంజలి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ కి భార్య గా, అదే విధంగా వర్తమానం లో నడిచే రామ్ చరణ్ క్యారక్టర్ కి తల్లిగా కనిపించనుంది. ఆమెకి సంబంధించిన లుక్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 20, 2024 / 05:15 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఆరేళ్ళ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ వచ్చే నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మొట్టమొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు నార్త్ అమెరికా లోని డల్లాస్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి హీరో రామ్ చరణ్ తో పాటు శంకర్, కైరా అద్వానీ, నిర్మాత దిల్ రాజు, శ్రీకాంత్, ఎస్ జె సూర్య మరియు సినిమాలో నటించిన మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఇలా విదేశాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంటున్న మొట్టమొదటి తెలుగు సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ మొదటి కాపీ ని నిర్మాత దిల్ రాజు ఇటీవలే పలువురు సినీ ప్రముఖులకు, మీడియా మిత్రులకు స్పెషల్ షో వేసి చూపించాడట. వాళ్ళు సినిమా చూసిన తర్వాత చెప్పిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ చిత్రం లో వచ్చే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశం మనకి టీజర్ లో చెప్పిన ‘అన్ ప్రెడిక్టబుల్’ డైలాగ్ ని మ్యాచ్ చేస్తుందని అంటున్నారు. ఆ రేంజ్ లో ఆ సన్నివేశాలు వచ్చాయట. చూసే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక సెకండ్ హాఫ్ లో ఎస్ జె సూర్య, రామ్ చరణ్ మధ్య వచ్చే ఒక 5 నిమిషాల సన్నివేశం థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకాలు వచ్చేలా చేస్తుందట. శంకర్ నుండి ఎలాంటి సినిమాలను మనం ఆశిస్తామో, గేమ్ చేంజర్ అంతకు మించే ఉంటుందని తెలుస్తుంది.

    ఇదంతా పక్కన పెడితే ఇందులో ప్రముఖ హీరోయిన్ అంజలి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ కి భార్య గా, అదే విధంగా వర్తమానం లో నడిచే రామ్ చరణ్ క్యారక్టర్ కి తల్లిగా కనిపించనుంది. ఆమెకి సంబంధించిన లుక్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసేందుకు ఆమె పాత్ర చాలా సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ లో ఆమె ఇచ్చే ట్విస్ట్ చూస్తే ఎలాంటి వాడికైనా ఫ్యూజులు ఎగిరిపోతాయట. ఇంతకూ ఆమె ఇచ్చే ట్విస్ట్ ఏమిటి?, అంతలా షాక్ అవ్వాల్సిన అవసరం ఏమిటి?, అసలు ఏమి జరిగింది అనేది తెలియాలంటే మరో 20 రోజులు ఎదురు చూడక తప్పదు. కేవలం అంజలి క్యారక్టర్ ఒక్కటే కాదు, ఈ సినిమాలో ప్రతీ పాత్ర వేరే లెవెల్ లో ఉందని టాక్. ఆ రేంజ్ లో ఉంటే ఈ సినిమా కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ అవుతుంది.