Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేస్తే చాలా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి. మరి అలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల మీద కూడా ఇప్పుడు మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక తను డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన పొలిటిషయన్ గా కూడా ఒక కీలక బాధ్యతను కొనసాగిస్తున్నాడు… ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు అహర్నిశలు సినిమాల కోసమే ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాని గిరి ప్రొడ్యూసర్ గా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాని మహేంద్ర రెడ్డి ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే గిరి కొద్దిరోజుల నుంచి కరుణాకరన్ తో బాగా ట్రావెల్ చేసి ఆ కథను షార్ప్ గా చేయించిన తర్వాత పవన్ కళ్యాణ్ కి వినిపించారట. పవన్ కళ్యాణ్ కూడా ఓకే అనడంతో ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కొంతమంది కావాలనే గిరి మీద పవన్ కళ్యాణ్ తో చాడీలు చెప్పారట. గిరి దగ్గర డబ్బులు లేవు సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో ఆపేసే ఉద్దేశ్యంలో ఉన్నాడు. కాబట్టి అలా చేస్తే మీ ఇమేజ్ కి బాడ్ నేమ్ వస్తుందని పవన్ కళ్యాణ్ గారితో చెప్పడంతో వెంటనే పవన్ కళ్యాణ్ మహేందర్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ ను పిలిచి ఆయన చేత ఈ సినిమాని స్టార్ట్ చేయించారట.
ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సిన అవకాశాన్ని తనకు రాకుండా కొంతమంది మధ్యవర్తులు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంతవరకు వాళ్ల మీద ఫైర్ అయ్యాడు ఇక ఏది ఏమైనా కూడా గిరి చేయాల్సిన సినిమాని మహేందర్ రెడ్డి చేస్తున్నారు.
కాబట్టి ఆయనే గిరిని పిలిచి తొలిప్రేమ సినిమా నైజాం రైట్స్ ని తీసుకోమని చెప్పారట. దాంతో తొలిప్రేమ నైజాం రైట్స్ ని 80 లక్షలు తీసుకున్నారు. సంధ్య థియేటర్లోనే ఈ సినిమా 80 లక్షలకు పైన కలెక్షన్లు వసూలు చేసిందట.
ఇక మిగతా థియేటర్లలో ఆడిన కలెక్షన్స్ మొత్తం అతనికి లాభంగా వచ్చాయని చెప్పాడు. పవన్ కళ్యాణ్ అంటే అలా ఉంటుందని సంధ్య థియేటర్లో ఆయన రికార్డ్ ను ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేరని చెబుతుండడం విశేషం… ఇక ఖుషి సినిమా కూడా సంధ్య థియేటర్లలో మంచి రికార్డుని క్రియేట్ చేసుకుంది…