Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. మరో వీకెండ్ దగ్గరపడుతుండగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ మొదలైంది. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ ఉంటున్నదన్న విషయం తెలిసిందే. ఈ వారం అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, దామిని ఉన్నారు. ఈ ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ రిజల్ట్ బయటకు వచ్చాయి. ఎవరు ఈ పొజీషన్ లో ఉన్నారో చూద్దాం…
సీరియల్ నటుడు అమర్ దీప్ ఒక్కడికే 31 శాతం ఓట్లు పడ్డట్లు సమాచారం. ఎలిమినేషన్లో ఉన్నవారిలో ఫేమ్ ఉన్న సెలెబ్ కావడంతో పాటు పీఆర్స్ వ్యవస్థ అతనికి సహకారం అందిస్తుంది. అమర్ దీప్ ని సోషల్ మీడియాలో బాగా ఎలివేట్ చేస్తున్నారు. అది ఓటింగ్ లో కనిపించింది. అమర్ దీప్ తర్వాత గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ గురించి పెద్దగా తెలియకున్నా స్ట్రాంగ్ పీఆర్స్ ని పెట్టుకుని హౌస్లోకి వచ్చాడనే వాదన ఉంది. ప్రిన్స్ యావర్ గత రెండు నామినేషన్స్ లో ఓటింగ్లో వెనుకబడ్డాడు. ఈసారి సత్తా చాటాడు.
గౌతమ్ కంటే స్వల్ప ఓట్ల తేడాతో ప్రిన్స్ యావర్ మూడో స్థానంలో ఉన్నాడట. ఇక శుభశ్రీకి నాలుగో స్థానం, రతికా రోజ్ కి ఐదో స్థానం దక్కిందట. ప్రియాంక, దామిని చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రతికా రోజ్, ప్రియాంకకు ఓటింగ్ లో స్వల్ప తేడా మాత్రమే ఉందట. ఇద్దరికీ 10 శాతానికి పైగా ఓట్లు వచ్చాయట. దామినికి మాత్రం కేవలం 4-5 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయట. ఆరో స్థానంలో ప్రియాంక కంటే దాదాపు 5 శాతం తక్కువ ఓట్లు దామినికి వచ్చాయి.
కాబట్టి దామిని ఎలిమినేట్ కానుందని అంటున్నారు. ఓటింగ్ రెండు రోజుల్లో ముగియనుండగా ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇదే జరిగితే వరుసగా మూడో లేడీ కంటెస్టెంట్ ఇంటిని వీడినట్లు అవుతుంది. ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, సెకండ్ వీక్ షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఆట సందీప్, శివాజీ పవర్ అస్త్ర గెలిచిన నేపథ్యంలో వాళ్లకు కొన్ని వారాలకు గానూ ఇమ్యూనిటీ లభించింది. వారు ఎలిమినేషన్ లో ఉండరు.