Telugu star hero rejected Ghaati: గమ్యం సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్ మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాని స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసాడు. మొత్తానికైతే ఇప్పుడు అనుష్కతో చేసిన ఘాటి సినిమాను ఈరోజు రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో అనుష్క మెయిన్ లీడ్ లో నటించింది. ఇక అనుష్క కి జోడిగా విక్రమ్ ప్రభు నటించాడు. ముందుగా విక్రమ్ ప్రభు ప్లేస్ లో వేరే ఒక తెలుగు స్టార్ హీరోని అనుకున్నారట. కానీ ఆ హీరోకి ఈ కథ నచ్చకపోవడం వల్ల ఆయన దానికి ఆసక్తి చూపించలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ హీరో ఎవరు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ హీరో రానాగా తెలుస్తోంది. క్రిష్ – రానాకి మధ్య చాలా మంచి అనుబంధమైతే ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించకపోయిన కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని తీసుకొచ్చి పెట్టింది.
అప్పటినుంచి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు. మరి ఘాటీ సినిమా కోసం మరోసారి అడిగినప్పటికి ఆ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని తను ఆ పాత్రకి సెట్ అవ్వనని రానా అయితే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఘాటి సినిమా రిజల్ట్ కొంచెం తేడాగా రావడంతో రానా ఈ సినిమా వదిలేసి మంచి పని చేశాడు అంటూ చాలామంది రానా గురించి మాట్లాడుతుండటం విశేషం…
ఇక ప్రస్తుతం క్రిష్ తన పాత పద్ధతిని వదిలిపెట్టి కొత్తగా కథలను రాసుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. అలాగే ప్రేక్షకుడిని మెప్పించాలంటే టెక్నాలజీని వాడుకుంటూ డిఫరెంట్ గా ట్రై చేయాలి అప్పుడే సక్సెస్ లైతే వస్తాయి…లేకపోతే మాత్రం ఆయన కూడా షెడ్డు కి పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…