https://oktelugu.com/

Star Heroines : పెళ్లి తర్వాత ఇవేం పనులు.. మారని స్టార్ హీరోయిన్ ల తీరు.

పెళ్లికి ముందు షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకున్నా నడుస్తుంది కానీ అత్తగారి ఇంటికి వెళ్లిన తర్వాత చీర కట్టుకోవాల్సిందే. ఆ పద్దతులను ఇష్టంగా గౌరవించాలి. లేదంటే తేడాలు వచ్చేస్తాయండీ బాబు. ప్రతి సారి చీరలే కాకుండా అప్పుడప్పుడు జీన్స్ వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది కానీ అందరి లైఫ్ లో కాదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 16, 2024 / 12:15 AM IST

    Star Heroines

    Follow us on

    Star Heroines :  అమ్మాయిలకు పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత అనే విధంగా లైఫ్ ఉంటుంది. చాలా మందికి ఈ తేడా కనిపిస్తుంది. కొందరికి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కొందరికి అత్త వారి ఇల్లు బాగుంటే చాలా మందికి అమ్మవారి ఇల్లు నచ్చుతుంది. అయితే ఈ పెళ్లి తర్వాత మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా? ముఖ్యంగా సంప్రదాయాలు కూడా మారిపోతాయి. సంప్రదాయాలు అంటే బొట్టు కట్టు అండోయ్ బాబు. పెళ్లికి ముందు షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకున్నా నడుస్తుంది కానీ అత్తగారి ఇంటికి వెళ్లిన తర్వాత చీర కట్టుకోవాల్సిందే. ఆ పద్దతులను ఇష్టంగా గౌరవించాలి. లేదంటే తేడాలు వచ్చేస్తాయండీ బాబు. ప్రతి సారి చీరలే కాకుండా అప్పుడప్పుడు జీన్స్ వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది కానీ అందరి లైఫ్ లో కాదు. అయితే ఇది అందరి లైఫ్ లో అప్లే కాదు. అందరి గురించి పక్కన పెడితే సినీ స్టార్ల విషయంలో ఎలా ఉంటుందో మీకు తెలుసా?

    గమనిస్తే పెళ్లి తర్వాత చాలా మంది స్టార్ హీరోయిన్ లు సైతం పద్దతిగా బట్టలు వేసుకోవడం, సినిమాల్లో కనిపించినా సరే మంచి పాత్రలను మాత్రమే ఎంచుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ అందరు ఇలా ఉండాలి అని లేదు కదా. కొందరి మెంటాలిటీ, ఇంటి వాతావరణం మరో విధంగా ఉంటుంది. సో అందరూ ఒకే లైన్ మీద ఉండాలి అని లేదు కదా. ఇక కొందరు స్టార్ హీరోయిన్ లు పెళ్లైతే గ్లామర్ షో చేయకూడదా అంటున్నారు?..? అలాగని రాజ్యాంగంలో ఏమైనా రాసారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు పెళ్లంటే కెరీర్‌కు శుభం కార్డ్ అనుకునేవారే ఎక్కు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తున్నాయి. పెళ్లైన హీరోయిన్ లకు కూడా క్రేజ్ ఎక్కువగా ఉంది. ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షోలో మరింత ఎక్కువే అంటున్నారు కొందరు స్టార్లు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా?

    కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలను చూడండి. ఈ ఫోటోల్లో ఎంత బాగుంది కదా. 15 సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న ఆంటోనీ తటిల్‌తో గోవాలో పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? పెళ్లికి రెండు మూడు రోజుల ముందే ఈమె చేసిన ఫోటోషూట్ చూస్తే పెళ్లి తర్వాత ఇదే కంటిన్యూనా అనే విధంగా ఉంది? పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి ఈ బ్యూటీ. బేబీ జాన్‌లో మునుపెన్నడూ ఇలాంటి గ్లామరస్ ఫోటోలతో పెద్దగా కనిపించలేదు. రకుల్ ప్రీస్ సింగ్ కూడా అంతే. గతేడాది ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడింది. ఆ తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచింది.

    కియారా అద్వానీ కూడా ఇదే రేంజ్ లో ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లైన తర్వాత కూడా లిప్ లాక్ సీన్స్‌తో పాటు గ్లామర్ షోలో మరింత రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఇక మిసెస్ రణ్‌బీర్ కపూర్ అలియా భట్ సైతం గ్లామర్ షోలో తగ్గేదేలే అంటోంది. కత్రినా కైఫ్, దీపిక పదుకొనే ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పెళ్లికి ఇంటి పేరు మారుతుది కానీ మా వస్త్రధారణల్లో కాదు అని రుజువు చేస్తున్నారు ఈ స్టార్లు.