Shiva Nirvana Ravi Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీ లతో సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకుడు శివ నిర్వాణ…’నిన్ను కోరి’ సినిమాతో మొదటి సక్సెస్ ని సాధించిన ఆయన ఆ తర్వాత నాగచైతన్య – సమంతలను పెట్టి ‘మజిలీ’ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అయిన తర్వాత నాని తో టాక్ జగదీష్ మూవీ చేశాడు…ఈ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేసి ప్రేక్షకుల యొక్క అటెన్షన్ ను తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఇప్పుడు రవితేజ సమంతలతో మరోసారి ఒక థ్రిల్లర్ జానర్ లో సినిమాని చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీలే కావడం విశేషం…
Also Read: ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్ళేనా..?
ఇక మొదటిసారి తన జానర్ మార్చి సినిమా చేయడం వల్ల ఈ సినిమా విషయంలో ఏదైనా అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు శివ నిర్వాణ లవ్ స్టోరీలను పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారనే ఒక మార్క్ అయితే ఉండేది.
అలాంటి మార్కును బ్రేక్ చేస్తూ సినిమాని ఏ విధంగా తెరకెక్కించబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథ కూడా సోషల్ మీడియాలో లేకైనట్టుగా తెలుస్తోంది. ఈ మూవీలో రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. ఒక మర్డర్ మిస్టరీని చేసిన క్రమంలో రవితేజ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తనకు సమంత ఏ రకంగా యూజ్ అయింది అనే దాని మీదనే ఈ సినిమా కథ నడవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే రవితేజ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
అలాంటి రవితేజతో శివ నిర్వాణ ఎలాంటి క్యారెక్టర్ చేయిస్తాడు. తద్వారా ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఈ మూవీతో సక్సెస్ సాధిస్తే రవితేజ కి ఒక కొత్త ఇమేజ్ వస్తుందనేది వాస్తవం…