https://oktelugu.com/

Nithin : నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమా స్టోరీ లీక్… అచ్చం ఆ సినిమా లాగే ఉందిగా…

మరి ఈ సినిమా మంచి విజయం సాధించి నితిన్ కి ఒక భారీ సక్సెస్ ని అందిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే...

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 09:02 AM IST
    Follow us on

    Nithin : ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోని వాళ్లలో హీరో నితిన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తూ మొదట్లో మంచి విజయాలను అందుకున్న నితిన్ ప్రస్తుతం హిట్టు కొట్టడం లో మాత్రం వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వేణు శ్రీ రామ్ డైరెక్షన్ లో కూడా తమ్ముడు అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని నితిన్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    దీనికి తగ్గట్టుగానే ఆయనకి వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. కాబట్టి ఈ రెండు సినిమాలతో వరుస విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు. అయితే తమ్ముడు సినిమా దర్శకుడు అయిన వేణు శ్రీరామ్ మా తర్వాత మరొక సినిమా చేయకుండా ఈ స్క్రిప్ట్ ని పట్టుకొని మూడు సంవత్సరాల నుంచి హీరోల కోసం వెతుకుతున్నాడు కాబట్టి ఈ స్క్రిప్ట్ ని చాలా గ్రిపింగ్ గా రాసుకొని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక అదే విధంగా తమ్ముడు సినిమా స్టోరీ ని కనక మనం ఒక్కసారి తెలుసుకున్నట్లైతే ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ నితిన్ ఇంట్లో చిన్న అబ్బాయిగా కనిపించబోతున్నాడు. ఇంట్లో ఉన్న బరువు బాధ్యతలు మొత్తాన్ని కూడా తనే మోయాల్సి వస్తుంది. ఇంటికి చిన్నోడు అయినప్పటికీ పెద్ద బాధ్యతలని తను తీసుకొని ఫ్యామిలీ మొత్తాన్ని లీడ్ చేసేవాడిగా ఈ సినిమాలో కనిపిస్తాడట. ఇక ముఖ్యంగా ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నితిన్ కి ఒక అక్క అన్న ఉంటాడు.

    వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలను బేస్ చేసుకొని వాళ్ల జీవితాల్లో వాచ్చే ప్రాబ్లమ్స్ ను నితిన్ సాల్వ్ చేసుకుంటూ వస్తాడు అనే దాని మీదనే ఈ సినిమా తెరకెక్కుబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ స్టోరీ విన్న చాలా మంది రొటీన్ తెలుగు సినిమా స్టోరీ లానే ఉందిగా అంటున్నారు. మరి ఈ సినిమా మంచి విజయం సాధించి నితిన్ కి ఒక భారీ సక్సెస్ ని అందిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…