https://oktelugu.com/

Khadgam Movie :  ఖడ్గం సినిమాలో సంగీత పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్…

ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్టుతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోలకి, హీరోయిన్లకి మదర్ క్యారెక్టర్లలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది...ఇక అందులో భాగంగానే సరిలేరు నీకేవ్వరు సినిమా లో రష్మీక తల్లి గా నటించి మెప్పించింది...

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2024 / 05:32 PM IST
    Follow us on

    Khadgam Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. ఈయన చేసిన సినిమాలన్నీ ఒక డిఫరెంట్ జానర్ లో ఉంటాయి. ఇక ముఖ్యంగా దేశభక్తికి అద్దం పట్టే విధంగా ఖడ్గం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హిందూ, ముస్లింల మధ్య అంతరాయాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, చాలా అవార్డులను కూడా గెలుచుకుంది.

    అయితే ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ ముగ్గురు కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక వీళ్ళతో పాటుగా సోనాలి బింద్రే, సంగీత లాంటి నటి మణులు కూడా నటించి మెప్పించారు. ఇక ఇదిలా ఉంటే సంగీత పోషించిన పాత్రలో మొదటి వేరే హీరోయిన్ ను తీసుకుందామని కృష్ణవంశీ అనుకున్నాడట. కానీ ఆ హీరోయిన్ ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో సంగీతని పరిచయం చేశాడు…అయితే సంగీత చేసిన పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు అంటే సాక్షి శివానంద్…

    ఇక ఈవిడ తెలుగులో చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలా పక్కన నటించింది… అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ సాక్షి శివానంద్ ని అడగగా ఆమె ఈ పాత్రని రిజెక్ట్ చేసింది. సోనాలి బింద్రే చేసిన క్యారెక్టర్ లో అయితే చేస్తానని చెప్పిందట. దానికి కృష్ణవంశీ అవసరం లేదు అని చెప్పి ఆ క్యారెక్టర్ లో సంగీతను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక మొత్తానికైతే సంగీత ఆ క్యారెక్టర్ లో నటించి మెప్పించడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం అందుకుంది.

    ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్టుతో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హీరోలకి, హీరోయిన్లకి మదర్ క్యారెక్టర్లలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది…ఇక అందులో భాగంగానే సరిలేరు నీకేవ్వరు సినిమా లో రష్మీక తల్లి గా నటించి మెప్పించింది…