Kalki Sequel: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. దాదాపుగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది కల్కి సినిమాకు సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనే , అమితాబచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ ఇలా పలు పాన్ ఇండియా నటీనటులు కీలక పాత్రలో కనిపించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హిందూ ఇతిహాసం దశావతారంలోని చివరి అవతారం అయినా కల్కి అవతారం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు నాగ్ అశ్విన్. మహాభారతంలోని సందర్భానుసారా సన్నివేశాలను దర్శకుడు చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఈ చిత్రంలో కర్ణుడి పాత్రలో ప్రభాస్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో ఎవరు నటించారు అనేది ఆసక్తిని కలిగించారు దర్శకుడు నాగ్ అశ్విన్. సినిమాలో కొంచెం సేపు మాత్రమే కనిపించే కృష్ణుడి పాత్ర మొఖాన్ని స్పష్టం గా చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేసారు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించింది ఎవరు అంటూ నేటిజెన్లు చాలా ఆసక్తిని చూపించారు.
ఈ క్రమంలోనే వాళ్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా ఈ సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించింది సూరరై పోట్రు సినిమాలో సూర్య స్నేహితుడుగా నటించిన బాలసుబ్రమణ్యం అని తెలిసింది. ఇది ఇలా ఉంటే కల్కి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమాలో కృష్ణుడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఉన్నారని ఒక వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. వస్తున్న ఈ వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా స్పందించినట్లు ఒక వార్త వినిపిస్తుంది. కల్కి సినిమా మొదటి భాగం లో కృష్ణుడి పాత్ర కొంచెం సేపే కావడంతో ముఖం స్పష్టంగా కనబడలేదని.
ఒకవేళ కృష్ణుడి పాత్రను ఎక్కువసేపు చూపించాల్సిన పరిస్థితి ఉంటే తప్పకుండా మహేష్ బాబును నటించేలా చేస్తానని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. దాదాపు రూ. 600 కోట్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయం అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. త్వరలో ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ ఏడాది 2024 లో అత్యంత వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా కల్కి నిలిచింది.