Chiranjeevi And Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం గుర్తుండిపోయే హీరోల్లో చిరంజీవి ఒకరు. ఇక తను ఒక్కడే సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ లను సాధించి మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక తనకంటూ ఒక మెగా ఫ్యామిలీ ఉందన్న చాటి చెప్పాడు. అలాగే ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు కూడా మాస్ ఆడియన్స్ మెప్పిస్తు వరుస సినిమాలు చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య చేసిన సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. అలాంటి బాలయ్య ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా బాలయ్య బాబు 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే చిరంజీవి బాలయ్య గురించి మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాలని చిరంజీవి, బాలయ్యలు అందులో భాగం చేయాలనే ఉద్దేశ్యం లో కొంతమంది దర్శకులకి కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మంచి కథను తీసుకొస్తే నేను బాలయ్య కలిసి నటిస్తామని చిరంజీవి చెప్పడంతో ఇప్పుడు కొంతమంది దర్శకులు వాళ్ళ మీద కథలను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో ముఖ్యంగా తెలుగులో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ వీళ్ళ మీద ఆల్రెడీ ఒక కథని రాసుకొని పెట్టుకున్నాడట. ఇక ఇప్పుడు ఆ కథనే బాలయ్య బాబుకి, చిరంజీవికి వినిపించాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక పెద్ద బాధ్యతను ప్రశాంత్ వర్మ ఎత్తుకున్నాడు.
ఆ బాధ్యతని చాలా సక్రమంగా నిర్వహిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ చిరంజీవి, బాలయ్య బాబులతో సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన వాళ్లకి కథని వినిపించాడా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీగా తెలియదు.
కానీ అటు బాలయ్య బాబుకి, ఇటు చిరంజీవికి బాగా క్లోజ్ గా ఉండే ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ఎలాగైనా సరే పట్టాలెక్కించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక మోక్షజ్ఞ చేయబోయే సినిమా తర్వాత చిరంజీవిని బాలయ్యను ఒప్పించి ఈ సినిమాని చేసి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తాడా లేదా అనేది…