Mana Shankara Vara Prasad Garu: బాక్స్ ఆఫీస్ వద్ద ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasaf చిత్రం రోజుకి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తూ నేటి తరం స్టార్ హీరోలకు టార్గెట్స్ ని సెట్ చేస్తోంది. మేకర్స్ ఈ చిత్రం కేవలం 8 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ సాధించిందని, ఫాస్టెస్ట్ 300 కోట్ల గ్రాసర్ అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ, ఈ సినిమా 8 రోజుల్లో రాబట్టింది కేవలం 240 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాట. 300 కోట్ల మార్కుని అందుకోవాలంటే ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు వీటి గురించి ఎలాంటి అవగాహనా ఆడియన్స్ కి లేదు. ఈ చిత్రం లో చిరంజీవి కొడుకు గా నటించింది అబ్బాయి కాదట, అమ్మాయి అట, ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.
అదే విధంగా ఈ సినిమాలో చిరంజీవి(Megastar Chiranjeevi) తన పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతున్న సమయం లో బ్యాక్ గ్రౌండ్ లో ఇంగ్లీష్ లిరిక్స్ తో ఒక పాట వస్తుంది గమనించారా?, ఈ పాట పాడింది మరెవరో కాదు, చిరంజీవి మేనకోడలు నైరా అంట. అంటే ఈమె చిరంజీవి చెల్లి కూతురు అన్నమాట. ప్రస్తుతం సింగపూర్ లో చదువుకుంటుంది. ఈమె వాయిస్ ని విన్న తర్వాత మెగా అభిమానులు కుటుంబం మొత్తం ఇంత టాలెంట్ గా ఉంటే ఎలా అయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రేపు ఈ వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నేడు సాయంత్రం ఒక ప్రోమో ని విడుదల చేస్తూ నైరా పాడుతున్న సమయం లో తీసిన ఒక వీడియో ని విడుదల చేశారు.
ఈ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏ సందర్భం లోనూ తన మేనకోడలు ఈ చిత్రం కోసం పని చేసింది అనే విషయాన్ని చెప్పలేదు. కనీసం విజయోత్సవ సభలో అయినా ఆమె గురించి మాట్లాడుతాడో లేదో చూడాలి. త్వరలోనే ఈ ఈవెంట్ కి సంబందించి అధికారిక వివరాలను తెలుపనుంది మూవీ టీం. ఇకపోతే పండగ పూర్తి అయ్యాక కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. సోమవారం రోజున ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు కూడా అదే రేంజ్ న మైంటైన్ చేసింది. చూస్తుంటే ఈ మూవీ థియేట్రికల్ రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు.
#FlyingHigh from #ManaShankaraVaraPrasadGaru is sung by Naira, Megastar #Chiranjeevi’s niece.
— Gulte (@GulteOfficial) January 20, 2026
