థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీలో రిలీజైంది. నిర్మాత కోన వెంకట్ ‘నిశబ్ధం’ మూవీని టీజీ విశ్వప్రసాద్.. వివేక్ కూచిబొట్లతో సంయుక్తంగా నిర్మించాడు. 65కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ తో కొనుగోలు చేసింది. ‘నిశబ్ధం’ మూవీకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించగా జి.గిరిష్.. గోపి సుందర్ సంగీతాన్ని అందించారు.
Also Read: మినీ షార్ట్ తో అనసూయ.. బీచ్ లో పిచ్చెక్కించింది!
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ‘నిశబ్ధం’ మూవీని అమేజాన్ ప్రైమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ మూవీ మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు చెందిన ఓ లోకల్ ఛానల్ త్వరలోనే ‘నిశబ్ధం’ మూవీని టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం నిర్మాత దృష్టికి వెళ్లడంతో సదరు ఛానల్ లీగల్ నోటీసులకు పంపించారు.
Also Read: మిహీకాతో ప్రేమాయణంపై రానా ఏమన్నాడంటే?
ఈమేరకు సదరు లోకల్ ఛానల్ కు నష్టపరిహారం కింద 1.1కోట్లు చెల్లించాలని లీగల్ నోటీస్‌లు పంపించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ సినిమా హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా మరో రూ.30లక్షలు పరిహారం చెల్లించాలని కోరినట్లు సమాచారం. దీనిపై ఓ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురితం చేయగా దర్శకుడు హేమంత్ మధుకర్ దీనిని రీ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై సదరు లోకల్ ఛానల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!