Ee Nagaraniki Emaindi Re Release: మనకి బోర్ కొట్టినప్పుడల్లా సరదాగా కాసేపు టైం పాస్ అయ్యేందుకు కొన్ని సినిమాలను చూస్తూ ఉంటాము, ఆ సినిమాలను చూస్తే అప్పటి వరకు మన మైండ్ లో ఉన్న టెన్సన్స్ అన్నీ మర్చిపోయి కాస్త ఉపశమనం పొందుతాము. అందులోని పాత్రలను చూసి మన నిజ జీవితం లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకొని నెమరు వేసుకుంటూ ఉంటాము. అలాంటి అద్భుతమైన సినిమాలలో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం.
తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్ సేన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. థియేటర్స్ లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఆదరణ దక్కించుకుంది. అందుకే ఈ సినిమా ఈనెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నిన్ననే ప్రారంభించారు. అయితే ఎప్పుడు ప్రారంభించారో తెలియదు కానీ, బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ మొత్తం అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ మెయిన్ సెంటర్స్ లో మాత్రమే కాదు, చిన్న చిన్న సెంటర్స్ లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరో కొత్త సినిమా విడుదల అయితే ఎంత స్పీడ్ గా ఉంటాయో, అంత స్పీడ్ గా ఉన్నాయి. ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న రోజే యంగ్ హీరో నిఖిల్ నటించిన కొత్త సినిమా ‘స్పై’ విడుదల అవుంతుంది.
ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లో పావు శాతం బుకింగ్స్ కూడా జరగలేదు, ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కాదు, వైజాగ్ , బెంగళూరు వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి కళ్ళు చెదిరే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.