Star Maa new reality show: మన తెలుగు ఆడియన్స్ కి తెలిసిన ఏకైక రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మాత్రమే. కానీ అంతకు మించిన రియాలిటీ షోస్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ‘MTV roadies’. బాలీవుడ్ లో బిగ్ బాస్ రియాలిటీ షో కంటే ఎక్కువ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇది. త్వరలోనే స్టార్ మా ఛానల్ లో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. రియాలిటీ షో అనగానే, బిగ్ బాస్ మాదిరిగా ఒక ఇంట్లో 20 మంది ఉండడం, వంద రోజుల పాటు టాస్కులు ఆడించడం వంటివి ఉంటాయని అనుకునేరు. అసలు హౌస్ కాన్సెప్ట్ అనేదే ఈ షో లో ఉండదు. కానీ టాస్కులు మాత్రం బిగ్ బాస్ షో లో ఉన్నవాటికంటే చాలా కఠినంగా ఉంటాయి. ఫిజికల్ టాస్కులు, మైండ్ గేమ్స్, ఎండ్యూరెన్స్ టాస్కులు, రేసింగ్ గేమ్స్, ఇలా ఒక్కటా రెండా, ఎన్నో టాస్కులు ఉంటాయి.
ఇవన్నీ వివిధ లొకేషన్స్ లో నిర్వహిస్తుంటారు. ఎండల్లో, మంచు పర్వతాల మధ్యలో కూడా టాస్కులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ గేమ్ షోలో నలుగురు మెంటర్స్ ఉంటారు. నలుగురి టీమ్స్ లోను చెరో 8 మంది కంటెస్టెంట్స్, లేదా 10 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వీరి మధ్య టాస్కులు నిర్వహిస్తారు. ప్రతీ ఎపిసోడ్ కి కూడా ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆడియన్స్ మెచ్చిన వాళ్ళే ఈ షోలో కొనసాగుతారు. ఒకవేళ ఒక మెంటర్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయితే, వారితో పాటు మెంటర్ కూడా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. బీబత్సమైన గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ కంటే చాలా ఆసక్తికరంగా ఈ షో ఉంటుంది. అయితే ఇక్కడ మెంటర్స్ గా ఎవరు వ్యవహరిస్తారు, హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ మాత్రమే ఇందులో మెంటర్స్ గా వ్యవహరిస్తారట. గత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ లో విన్నర్ , రన్నర్ గా నిల్చిన కళ్యాణ్, తనూజ లు మెంటర్స్ గా వ్యవహరించబోతున్నారని టాక్. మిగిలిన ఇద్దరు మెంటర్స్ కూడా బిగ్ బాస్ గత సీజన్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారని తెలుస్తోంది. వీటి వివరాలు త్వరలోనే అధికారికంగా రానుంది. ఇక ఈ షోకి ఒక యంగ్ హీరో హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని టాక్, మరి ఎవరు ఆ యంగ్ హీరో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘BB జోడి 2’ డ్యాన్స్ ప్రోగ్రాం పూర్తి అవ్వగానే ఈ రియాలిటీ షో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.