Radhe Shyam Second Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. కాగా ‘రాధేశ్యామ్’ విడుదల తేదీ దగ్గరపడేకొద్ది ప్రమోషన్స్ను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగానే మరో ట్రైలర్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్చి 2న మధ్యాహ్నం 3 గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా, రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఇచ్చారు.

ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఐమాక్స్‌లో 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.
Also Read: ‘రష్మిక మందన్నా’ పెళ్లి పై కొత్త పుకార్లు
దీంతో ఈ సినిమాని ఇండియన్ టైటానిక్ అంటూ అప్పుడే పోలికలు మొదలెట్టేశారు. అన్నట్టు ఈ క్రమంలో రాధేశ్యామ్ విడుదలకు ముందే మరో రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం మార్చ్ 11న విడుదల కానుండగా, యూఎస్ లోని ఐమాక్స్ థియేటర్ బుకింగ్స్‌లో కూడా అప్పుడే 70 శాతం టికెట్స్ అమ్ముడు పోయాయి. మొత్తానికి విడుదలకు ముందే రాధేశ్యామ్ రికార్డుల వెంట మొదలైనట్టు ఉంది.

ఎంతైనా నేషనల్ స్టార్ గా ప్రభాస్ రేంజ్ ప్యాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో పెరిగిపోయింది. రాధేశ్యామ్ కోసం దాదాపు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్ నటించే యాక్షన్ బ్లాస్టర్ సలార్ పై ఓ ఆసక్తికర విషయం చర్చలో ఉంది.
Also Read: ప్రేమలో ‘నిత్యా మీనన్’… నిజమేనా ?
[…] Udumbu Movie Telugu Remake: మలయాళంలో మంచి విజయం సాధించిన “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదని చిత్ర దర్శకనిర్మాత కె.టి.తమరక్కుళం ప్రకటించారు. “ఉడుంబు” చిత్రాన్ని కె.టి.మూవీ హౌస్ పతాకంపై స్వీయ నిర్మాణంలో కె.టి.తమరక్కుళం దర్శకత్వం వహించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన “ఉడుంబు” మలయాళంలో అనూహ్య విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం పలువురు తెలుగు దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరిచారు. […]