Bigg Boss 9 Telugu Suman Shetty: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో మోస్ట్ లక్కీ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమన్ శెట్టి మాత్రమే. ఈయన మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే టాస్కులు ఆడడం తక్కువే, నామినేషన్ పాయింట్స్ అసలు పెట్టలేడు, చాలా కామెడీ గా ఉంటాయి, తనకంటూ ఒక అభిప్రాయం ఉండదు, ఎంటర్టైన్మెంట్ అందించడం లో సూన్యం. 14 వారాలు హౌస్ లో కొనసాగేంత అర్హత ఇతనికి ఉందా చెప్పండి?. సంజన, రీతూ చౌదరి కంటే ఇతనికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అంటే నమ్ముతారా?, కానీ నిజంగానే ఆయనకు వాళ్ళిద్దరి కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసలు హౌస్ లో ఏమి చేయకపోయినా ఎందుకు ఆయన ఇంత కాలం కొనసాగుతున్నాడు అనేది ఎవరికీ అర్థం అవ్వని పరిస్థితి. ఇతనితో పోలిస్తే మొదటి మూడు వారాల్లో ఎలిమినేట్ అయిపోయిన శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్ మరియు ప్రియా శెట్టి వంటి వారు వెయ్యి రెట్లు బెటర్ అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇలా ఎంతో మంది హౌస్ లో అర్హత ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతూ, అసలు ఏమి చెయ్యని సుమన్ శెట్టి ఇన్ని రోజులు హౌస్ లో ఉండడం న్యాయం అనిపిస్తుందా?, అసలు సుమన్ శెట్టి లో ఏమి చూసి ఆడియన్స్ ఇన్ని రోజులు కొనసాగిస్తూ వస్తున్నారు అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఆయన వ్యక్తిత్వం పరంగా చాలా మంచోడు, కల్ముషం లేని మనసు. మిగిలిన కంటెస్టెంట్స్ లాగా ఫేక్ ఎమోషన్స్ చూపించడం, కన్నింగ్ ఆలోచనలు చేయడం ఇతనికి రాదు. అంతే కాకుండా చాలా అమాయకుడు కూడా. లోక జ్ఞానం తెలియని వ్యక్తి లాగా అనిపిస్తుంటాడు. ఇది ఆడియన్స్ కి బాగా నచ్చడం వల్లే ఆయన్ని ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగించారు. అంతే కాకుండా ఇతను ఉన్న ఎత్తుకి టాస్కులు ఆడడం చాలా కష్టం.
కానీ టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా, సుమన్ శెట్టి తన వైపు నుండి నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేసాడు. గత వారం లో ఆయన ఆడిన టాస్కులు అందుకు ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. అలా ముందు వారాల్లో కూడా ఆయన టాస్కులు ఆడే ప్రయత్నం చేసాడు. గెలిచాడా?, ఓడిపోయాడా అనేది తర్వాత సంగతి, తన పొడవుకి ధైర్యం చేసి ఆడాడు చూసారా?, అక్కడే ఆయన ఆడియన్స్ మనసులను దోచుకున్నాడు. కానీ ఈ వారం ఆయన సేవ్ అవ్వడం చాలా కష్టమని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం అందరికంటే తక్కువ ఓటింగ్ ఆయనకే ఉందట. మిడ్ వీక్ లో కానీ, వీకెండ్ లో కానీ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.