Shiva Re Release: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు అతనికి పెద్దగా గుర్తింపును తీసుకురాకపోయిన ఆ తర్వాత కాలంలో చేసిన చాలా సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. ‘యువ సామ్రాట్’ గా తనకంటూ ఒక గొప్ప బిరుదును కూడా తీసుకొచ్చి పెట్టాయి. జనాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను ఎంచుకొని సినిమాలుగా చేసిన హీరోల్లో నాగార్జున ఒకరు… కెరియర్లో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప విజయాలు అతనికి తగ్గాయి. అలాంటి నాగార్జున ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ఎన్ని సినిమాలు చేసిన కూడా అతని కెరియర్లో నిలిచిపోయే సినిమా ఏదైనా ఉంది అంటే అది శివ అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. నాగార్జున కెరియర్ లో సైతం ఇప్పటివరకు అలాంటి సినిమా రాలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి ఎంత గుర్తింపు తీసుకొచ్చాయనే విషయం పక్కన పెడితే ఒక్కసారిగా నాగార్జున ఇమేజ్ మొత్తాన్ని మార్చేస్తూ తనను మాస్ హీరోగా నిలబెట్టి పోటీపడే స్థాయికి తీసుకెళ్ళింది…
ఇక అలాంటి శివ సినిమా ఇప్పుడు డాల్బీ అట్మాస్ సౌండ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ లెవెల్లో చేపడుతున్నాడు. ఇప్పటికే చాలామంది హీరోలు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వాల్యుబుల్ మాటల్ని చెప్పారు.
దాంతో నాగార్జున ఇప్పుడు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు…ఇక ఈ సినిమా రీరిలీజ్ లో సైతం పలు రికార్డులు బ్రేక్ చేస్తోంది అంటు నాగార్జున పెట్టుకున్నా నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందా? లేదా అనేది చూడాలి. ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాగార్జునకి మంచి గుర్తింపైతే వస్తోంది.
ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను అలరించడం లేదు. కాబట్టి మరోసారి తన సత్తా చాటుకుంటే తను చేయబోతున్న వందో సినిమాకి ఇది చాలా వరకు హెల్ప్ అవుతోందనే ఉద్దేశ్యంతోనే నాగార్జున ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ సినిమా అప్పుడు ఎలాంటి మ్యాజిక్ ను చేసిందో ఇప్పుడు రీరిలీజ్ లో సైతం అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…