Bigg Boss 9 Telugu Sai Srinivas Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో ఊహించని సంఘటనలు, ఊహించని ట్విస్టులు, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఆడియన్స్ కి అనిపిస్తోంది. సీజన్ హిట్ అయ్యిందా, ఫ్లాప్ అయ్యిందా అనేది కాసేపు పక్కన పెడితే, ప్రతీ ఎపిసోడ్ ఆడియన్స్ కి నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. కానీ అత్యధిక శాతం ఎమోషన్స్ ఉండడం తో, కొంతమంది ఆడియన్స్ టీవీ సీరియల్ ని చూసినట్టుగా అనిపిస్తోంది అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే చెయ్యాలని అనుకుంది బిగ్ బాస్ టీం. కానీ రాము రాథోడ్ ఇంటికి వెళ్ళాలి అని మారం చేయడం తో శనివారం ఎపిసోడ్ లోనే అతన్ని ఎలిమినేట్ చేసి పంపేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఇద్దరూ కూడా బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్స్ ని పూర్తి చేసారు. ఓటింగ్ లో అందరి కంటే తక్కువ సాయి శ్రీనివాస్ కి వచ్చిందట. ఎలిమినేషన్ రౌండ్ లో సంజన సాయి తో పాటు సంజన ఉన్నారా?, లేదా భరణి ఉన్నారా అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు అనేది మాత్రం ఖరారు అయ్యింది. సాయి శ్రీనివాస్ హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు తనదైన మార్కు ని క్రియేట్ చేసుకోవడం లో విఫలం అయ్యాడు. నిర్ణయాలు తీసుకోవడం లో కానీ, టాస్కులు ఆడడం లో కానీ సాయి శ్రీనివాస్ ఎందుకో బాగా వెనకపడ్డాడు. పైగా లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి మాత్రమే కాదు, చూసే ఆడియన్స్ కి కూడా సాయి అనేక సందర్భాల్లో కన్నింగ్ గా ప్రవర్తించాడని అంటున్నారు.
ఇవన్నీ ఎఫెక్ట్ ఇవ్వడం తో ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఇది సాయి కి మంచి అవకాశం అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ కి రాకముందు ఆయన అనేక సినిమాల్లో నటించాడు కానీ, పెద్దగా గుర్తింపు మాత్రం దక్కలేదు. అలాంటి సమయంలో ఈ బిగ్ బాస్ షో ద్వారా ఆయన కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. కేవలం ఆడియన్స్ కి మాత్రమే కాదు, డైరెక్టర్స్ దృష్టిలో కూడా పడే ఉంటాడు. చూడాలి మరి ఇక్కడి నుండి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు సాయి శ్రీనివాస్ దాదాపుగా 8 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అంటే వారానికి రెండు లక్షలు అన్నమాట. ఇంకొక్క వారం వస్తే నేనేంటో నిరూపించుకుంటా అన్నాడు, కానీ ఆడియన్స్ అతనికి అవకాశం ఇవ్వలేదు. చూడాలి మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.