Tarzon Hero Ran Ely: 1960 కాలంలో కండలు తిరిగిన దేహం, మంచి నటనతో అమ్మాయిల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటుడు రోనాల్ పియర్స్ ఎలీ. రోనాల్ పియర్స్ ఎలీ అంటే కొంత వరకు గుర్తు పట్టకపోవచ్చు గానీ రాన్ ఎలీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. 1960లో ఆయన చేసిన ‘టార్జాన్’ సీరియల్ చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మూవీ ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన రాన్ ఎలీ ఈ రోజు (అక్టోబర్ 24) తన 86వ ఏటా తెల్లవారు జామున మరణించాడు. ఎలీ 21, జూన్ 1938-బుధవారం రోజున టెక్సాస్ లోని హియర్ ఫోర్డ్ లో జన్మించాడు. చదువు పూర్తయిన తర్వాత నవల రచన వైపునకు అతని అడుగులు పడ్డాయి. 1699 నుంచి 1968 వరకు వచ్చిన టార్జాన్ టీవీ సీరియల్ లో టార్జాన్ పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన ఎన్నో విన్యాసాలు చేశాడు. చాలా సార్లు గాయాలపాలయ్యాడు కూడా.. సౌత్ పసిఫిక్ -1958, ఎయిర్‌ప్లేన్ నావిగేటర్‌గా, ది ఫైండ్ హూ వాక్డ్ ది వెస్ట్ -1958, ది రిమార్కబుల్ మిస్టర్ పెన్నీప్యాకర్ -1959 వంటి చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన తర్వాత ఎలీ 1966లో టార్జాన్ పాత్రకు ఎంపికయ్యాడు.
ఇక అతని వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే.. టెక్సాస్ లో పుట్టిన ఆయన అమరిల్లో లో పెరిగాడు. అక్కడే విద్యాభ్యాసం చేశాడు. 1959లో తన ప్రియురాలు హెలెన్ జానెట్ ట్రిప్లెట్ ను వివాహం చేసుకున్నాడు. ఈమె రాన్ ఎలీతో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలు. వీరి దాంపత్యం ఎన్నో రోజులు సాగలేదు. టెక్సాస్ లోని హియర్ ఫోర్డ్ లో వీరు 1961లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అతను కొంత మంది సహ నటులతో ప్రేమాయణం కొనసాగించాడు. 1981లో మిస్ ఫ్లోరిడా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్న వాలెరీ లుండీన్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ముగ్గురు పిల్లలు కిర్‌స్టెన్, కైట్‌ల్యాండ్, కామెరాన్ కు జన్మనిచ్చారు.
ఆ తర్వాత రాన్ ఎలీ భార్య అక్టోబరు 15, 2019న శాంటా బార్బరాలోని కోస్టల్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ, కాలిఫోర్నియాలోని హోప్ రాంచ్‌లో తన నివాసంలో లుండీన్ కత్తిపోట్లకు గురై మరణించింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు తన కొడుకు కామెరాన్ తల్లి హత్యకు కారణమని తెలిసింది. అయితే కామెరాన్ క్రానిక్ ట్రామాటిక్ ఎన్సెఫలోపతి ఫస్ట్ స్టేజీతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కొంత కాలానికి కామెరాన్ కూడా మరణించాడు.
ఆ తర్వాత రాన్ ఎలీ కాలిఫోర్నియాలోని లాస్ అలమోస్‌లోని తన కుమార్తెల్లో ఒకరైన కిర్‌స్టన్ కాసలే ఇంటిలో సెప్టెంబర్ 29, 2024న 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. అయితే అతని మరణ ధ్రువీకరణ వార్తను ఆయన కూతురు అక్టోబర్ అక్టోబర్ 23, 2024న ప్రకటించింది. తన ఇన్ స్టా ఖాతా నుంచి తండ్రికి హృదయపూర్వక నివాళి అర్పించింది.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘ప్రపంచంలో తనకు తెలిసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయానని చెప్పింది. నేను నా తండ్రిని కోల్పోయాను. అతను ఒక నటుడు, రచయిత, కోచ్, గురువు, ఫ్యామిలీ మ్యాన్, నాయకుడు. అతను ఎక్కడికి వెళ్లినా ఆ ప్రదేశం మొత్తం తనకు సానుకూలంగా మలుచుకోగలడు. ఇతరులపై అతను చూపిన ప్రభావం నేను మరే వ్యక్తిలోనూ చూడలేదు. అతనిలో ఏదో మ్యాజిక్ ఉంది.’ అని చెప్పింది.
అయినా ఆమె రాన్ ఎలీ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని మాత్రం వివరించలేదు. అయితే తన భార్యను తన కొడుకు హత్య చేసినప్పటి నుంచి రాన్ తీవ్రమైన డీప్రెషన్ లోకి వెళ్లినట్లు మాత్రం తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించుకుంటూ వస్తోంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The reason behind the death of tarzan hero ron elys daughter announced after a month
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com