Venkatesh Neeraja : నీరజను వెంకటేష్ అందుకే పెళ్లి చేసుకున్నాడు.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా? వీరి వివాహం వెనుక సీక్రెట్ ఇదే..

నీరజ అమ్మమ్మ గారిది కృష్ణాజిల్లా కాకిలూరు దగ్గర ఉన్న వరాహ పట్నం, వీరిది కూడా సంపన్న కుటుంబమే, నీరజా చదువుకునే రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మ వారి ఇంటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసే వారట.

Written By: NARESH, Updated On : September 25, 2023 12:59 pm

venkatesh neeraja

Follow us on

Venkatesh Neeraja :  చేతికి ఉన్న వేళ్లే ఒకలా ఉండవు. అలాంటిది మనుషులు అందరూ ఒకలా ఉంటారా? అందులో ఇండస్ట్రీలోని హీరోలందరూ ఒకే విధంగా ఉంటారా? అసాధ్యం కదా.. అయితే ఒక మంచి వ్యక్తిత్వం, మంచి మనుసు ఉన్న హీరో ఎవరు అంటే వెంకటేష్ పేరు ముందుగా గుర్తు వస్తుంటుంది. అందులో మరీ ముఖ్యంగా ఈయన వ్యక్తిత్వం అంటే చాలా మందికి ఇష్టం. ఇండస్ట్రీలో కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా రానానాయుడు అనే వెబ్ సిరీస్ తో పలకరించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి రూమర్ లేదు ఈ హీరోపై..

ఒక సందర్భంలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో తానే స్వయంగా వెంకీని కొనియాడారు. సినీ ఇండస్ట్రీలో స్వామి వివేకానంద అని పొగడడంతో వెంకీ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇలా మంచికి మారుపేరుగా ఉంటూ.. చెడును, చెడు రూమర్స్ ను దగ్గరికి రానివ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలినా విక్టరీ పెళ్లి, ఆయన సతీమణి నీరజ గురించి కొన్ని విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇంతటి మహోన్నతమైన క్యారెక్టర్ ఉన్న వెంకటేష్ కు ఇప్పటికీ మహిళల్లో ఎంతో ఆదరణ ఉంది. ఒక వివాహబంధంలో వారు అద్భుతంగా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం వారికి వచ్చిన జీవిత భాగస్వామి. అయితే వెంకటేష్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్శనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన ఎప్పుడూ, ఎక్కడా తన భార్య, పిల్లల గురించి గాని కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడరు. నీరజారెడ్డి గంగవరపు వెంకటసుబ్బారెడ్డి ఉషారాణి దంపతులకు జన్మించింది. ఈమెది చిత్తూరు జిల్లా మదనపల్లి సొంత ఊరు.

నీరజా కుటుంబ సభ్యులు జమీందారి కుటుంబం అని టాక్. అంతే కాదు ఆమె తండ్రి భూస్వామట. భూమితో పాటు వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయట. మదనపల్లిలో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవరు అంటే వెంటనే ఈయన పేరు వినిపిస్తుంది అని ఇప్పటీకీ టాక్ ఉంది. ఒకానొక సమయంలో రామానాయుడు వెంకటేష్ కు పెళ్లి చేయాలని ఎవరైనా అమ్మాయి ఉంటే చూడాలని విజయ నాగిరెడ్డి చెప్పగా నీరజా గురించి చెప్పారు. నీరజ అమ్మమ్మ గారిది కృష్ణాజిల్లా కాకిలూరు దగ్గర ఉన్న వరాహ పట్నం, వీరిది కూడా సంపన్న కుటుంబమే, నీరజా చదువుకునే రోజుల్లో సెలవుల సమయంలో వారి అమ్మ వారి ఇంటికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసే వారట.

2014లో బిజేపీ తరుపున పోటీ చేస కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు క్యాబినేట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస రావు నీరజకు మేనమామ. ఎన్నికలప్పుడు కూడా నీరజా ప్రచారంలో పాల్గొన్న చాలా గ్రామాల్లో వీరికి సపోర్ట్ దొరికింది కూడా. ఈమె చదువులు మదనపల్లిలో సిఎస్ఐ గర్ల్స్ కాలేజీలో పదవ తరగతి వరకు చదివారు. తర్వాత మదనపల్లి లోని వీ.టి కాలేజీలో చదువుకున్నారు. అక్కడితోనే ఈమె చదువులు ఆగిపోలేదు ఎంబీఏ కూడా చేశారట. అయితే నాగిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం గురించి చెప్పడంతో రామానాయుడు మదనపల్లి వెళ్లి ముందుగా నీరజాను చూసి వచ్చారు. తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇద్దరూ ఒకరికొకరు నచ్చడంతో 1989 లో వెంకటేష్, నీరజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పటి నుంచి ఒక రిమార్క్ కూడా లేకుండా ఎంతో ఆదరణ పొందిన జంటగా, పాజిటివ్ టాక్ తోనే ముందుకు వెళ్తున్నారు.