https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదా, షాకింగ్ మేటర్ తెరపైకి!

ప్రభాస్ వివాహం ఎప్పుడు చేసుకుంటాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ప్రభాస్ వివాహం చేసుకోకపోవడానికి కారణం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు. ప్రభాస్ ని ఓ ప్రముఖ వ్యక్తి భయపెట్టాడని తెలుస్తుంది. ఆ సంగతి ఏమిటో చూద్దాం..

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 01:59 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: ప్రభాస్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. 45 ఏళ్ల ప్రభాస్ ఇంకా వివాహం చేసుకోలేదు. ఆయన వివాహం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాస్ తమకు నటవారసుడిని అందించాలని ఆశపడుతున్నారు. ప్రభాస్ మాత్రం ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు. బాహుబలి 2 విడుదల తర్వాత ప్రభాస్ వివాహం అనే ప్రచారం జోరుగా సాగింది. హీరోయిన్ అనుష్క శెట్టిని ప్రేమిస్తున్న ప్రభాస్ వివాహం చేసుకుంటాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను ప్రభాస్, అనుష్క ఖండించారు. తాము మంచి మిత్రులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అంతకు మించిన రిలేషన్ తమ మధ్య లేదన్నారు.

    ఆదిపురుష్ సమయంలో కృతి సనన్ కి ప్రభాస్ దగ్గరయ్యాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు కూడా పుకార్లు గానే మిగిలిపోయాయి. ప్రభాస్ తో ఎఫైర్ రూమర్స్ ని కృతి సనన్ కొట్టి పారేసింది. అసలు ప్రభాస్ వివాహం చేసుకుంటాడా లేదా? అనే సందిగ్ధత కొనసాగుతుండగా.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభాస్ పెళ్లి మేటర్ పై స్పందించాడు. ఈ మేరకు ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    గ్రేట్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకార్థం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా సిరివెన్నెల రాసిన కొన్ని పాటలను ప్రభాస్ గుర్తు చేసుకున్నాడు. జల్సా మూవీ లోని ‘చలోరే చలోరే చల్’ సాంగ్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం అట. ఏ పార్టీకి వెళ్లినా ఆ పాటను ఉద్దేశించి ఆయన మాట్లాడతారట. సమయం దొరికినప్పుడల్లా ఆ సాంగ్ ప్రభాస్ వింటారట.

    రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన మనీ మూవీలో ‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ’ అనే సాంగ్ సిరివెన్నెల రాశారు. ఆ మూవీలో అసలు వివాహం చేసుకోవద్దని రాశారు. అనంతరం చాలా సినిమాల్లో పెళ్లి ఎంతో గొప్పది అన్నట్లు రాశారు. ఈ రెంటిలో ఏది నమ్మాలి. నేను పెళ్లి చేసుకోవాలా వద్దా? అని ప్రభాస్ అన్నారు. సిరివెన్నెల సాహిత్యం ప్రభాస్ ని అయోమయానికి గురి చేసింది. అందుకే పెళ్లి చేసుకోవాలా వద్దా? అనే అయోమయంలో ఆయన ఉండిపోయారనే ఓ వాదన తెరపైకి వచ్చింది.

    మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటుంది. సలార్ 2, ఫౌజి, కల్కి 2, స్పిరిట్ చిత్రాల్లో ఆయన నటించాల్సి ఉంది.