The Raja Saab Second Half: రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ తనను చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాలన్ని ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుండటం విశేషం… ఇక ఇప్పటికే ఆయన సలార్, కల్కి లాంటి రెండు భారీ సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు ‘రాజాసాబ్’ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో సక్సెస్ ని సాధించి వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ప్రభాస్ ఉన్నాడు… రీసెంట్ గా ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ల కోసం ప్రివ్యూ వేసినట్టుగా తెలుస్తోంది. కొంతమంది సినిమా సెలబ్రిటీలు ఈ సినిమా బాగుందని చెబుతున్నారు.
ఇంకొంత మంది మాత్రం సెకండాఫ్ కొంత వరకు డల్ అయిందనే వార్తలు కూడా వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి…నిజానికి మారుతి కావాలనే కొంచెం సెకండాఫ్ డల్ చేసి మళ్లీ క్లైమాక్స్ ని చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ గా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది… ఇక ఫస్టాఫ్ మొత్తం ప్రభాస్ కామెడీ ఉంటుందని, సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయట.
క్లైమాక్స్ లో ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా మారుతి డైరెక్షన్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక రాజాసాబ్ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే జనవరి 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఈ సినిమా సక్సెస్ అయితే మారుతి టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు. ప్రభాస్ సైతం హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటాడు…
ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమా మీద చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రభాస్ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులందరు ఆశ్చర్యపోతారని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. బుజ్జిగాడు, డార్లింగ్ తర్వాత ఆ రేంజ్ కామెడీని ఈ సినిమాలో చూపిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…