The Raja Saab Closing Collection: ప్రతీ స్టార్ హీరో కి తమ కెరీర్ లో ఒక దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ ఉంటుంది. ఎలాంటి ఫ్లాప్ అంటే, ఆ సినిమా పేరు ఎత్తితేనే అభిమానులు భయపడేంత పెద్ద ఫ్లాప్ అన్నమాట. అలాంటి ఫ్లాప్ ప్రభాస్(Rebel star Prabhas) కెరీర్ లో ‘రాజా సాబ్'(Raja Saab Movie) అని చెప్పొచ్చు. ప్రభాస్ సినిమా ఎంత చెత్తగా ఉన్నా, కనీసం వారం రోజులు థియేటర్స్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తాయి. కానీ ‘రాజా సాబ్’ చిత్రానికి రెండు రోజులకే రన్ ఆగిపోయింది. 5వ రోజు నుండి హైదరాబాద్ లాంటి పాపులర్ సిటీస్ లోనే 200 కంటే తక్కువ షోస్ పడిపోయింది. దీనిని బట్టీ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్ ఆవేదన తో మారుతీ ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి తిడుతూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన లో నిజముంది, మారుతీ ని జీవిత కాలం తిట్టినా తప్పు లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘ఖలేజా'(#Khaleja4K) మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ కంటే ఒక ప్రాంతంలో చాలా తక్కువ వసూళ్లను రాబట్టింది అట. ఇంతకీ ఆ ప్రాంతం మరేదో కాదు, RTC క్రాస్ రోడ్స్. హైదరాబాద్ లో మూవీ లవర్స్ తమ అభిమాన హీరో సినిమాని మొదటి రోజు మొదటి ఆట ఇక్కడ చూడకపోతే పెద్ద పాపం లాగా ఫీల్ అవుతారు. అలాంటి ప్రాంతమిది. ఇక్కడ ‘ఖలేజా’ రీ రిలీజ్ కి క్లోజింగ్ లో 96 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘రాజా సాబ్’ చిత్రానికి క్లోజింగ్ లో కేవలం 84 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు మిగతా సినిమాలు లాగా ప్రీమియర్ షోస్ పడలేదు. మొదటి రోజు దేవి, సుదర్శన్ థియేటర్స్ లో విడుదల లేదు. ఫలితంగా మొదటి రోజు కలెక్షన్స్ కేవలం 40 లక్షలు మాత్రమే వచ్చింది.
ఇక రెండవ రోజు కూడా మంచి వసూళ్లు వచ్చాయి, మూడవ రోజు కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదలైందో అప్పటి నుండి ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అందుకే కనీసం కోటి రూపాయిల గ్రాస్ కూడా రాబట్టలేక, ‘ఖలేజా’ రీ రిలీజ్ కంటే తక్కువ గ్రాస్ రాబట్టి ప్రభాస్ కి మాయని మచ్చ లాగా మిగిలింది ఈ చిత్రం. ఒకవేళ మిగిలిన సినిమాలు లాగానే ‘రాజా సాబ్’ కి కూడా ప్రీమియర్ షోస్ పడుతుంటే, ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ చివరికి ఎవరైనా చూసేది ఫైనల్ కలెక్షన్స్ ని మాత్రమే, కారణాలు చూడరు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో నిన్నటి నుండి ప్రచారం చేస్తూ ప్రభాస్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
