The Raja Saab: పాన్ ఇండియన్ డైరెక్టర్స్ మోజులో పడి అభిమానులు కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ని చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. అలా డైరెక్టర్ మారుతీ(Director Maruthi) ని కూడా ప్రభాస్ అభిమానులు ‘రాజా సాబ్’ మూవీ విషయంలో చాలా తక్కువ అంచనా వేశారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్నటువంటి మారుతీ తో సినిమా ప్రకటించిన రోజు ప్రభాస్(Rebelstar Prabhas) అభిమానులు మేకర్స్ ని ట్యాగ్ చేసి, దయచేసి ఈ చిత్రాన్ని ఆపేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. ఫస్ట్ లుక్ విడుదలకు ముందు వరకు కూడా అభిమానుల్లో ఈ చిత్రం పై ఇలాంటి అంచనాలే ఉండేవి. కానీ ప్రతీ మనిషికి జీవితం లో తనని తాను నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. డైరెక్టర్ మారుతీ జీవితంలో ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం అలాంటి ఒక అద్భుతమైన అవకాశమే. అందుకే తనకు వచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవడానికి ప్రతీ క్షణం ఎంతో కష్టపడ్డాడు.
అ ఫలితాన్ని రాజా సాబ్ చిత్రం ద్వారా చూడబోతున్నారని ఈ సినిమాకి పని చేస్తున్న VFX డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు చెప్తున్నారు. హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల ఊహలకు మించి ఉంటుందట. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ హారర్ చిత్రం లో కూడా ఉందని విధంగా ఉంటుందట. రెండవ భాగానికి భారీ లీడ్ ని ఇస్తూ, బుర్ర బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ తో సినిమా ముగుస్తుందట. అంటే ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుంది అనేది ఖరారైంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన సినిమాలలో ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలకు సీక్వెల్స్ ని ప్రకటించేశాడు. త్వరలో ఈ సీక్వెల్స్ షూటింగ్స్ మొదలు కాబోతున్నాయి. ఇవి ఎప్పుడు మొదలై , ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సినిమాలు పట్టాలెక్కాలంటే ముందుగా హను రాఘవపూడితో చేస్తున్న సినిమా, అదే విధంగా ‘స్పిరిట్’ చిత్రం పూర్తి అవ్వాల్సి ఉంది.
ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యి, విడుదలయ్యాక ‘సలార్’, ‘కల్కి’ చిత్రాల సీక్వెల్స్ పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడు ఈ సీక్వెల్స్ జాబితాలోకి ‘రాజా సాబ్’ కూడా వచ్చి చేరింది. ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో ఎవరికీ క్లారిటీ లేదు కానీ, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ‘నెవెర్ బిఫోర్’ రేంజ్ లో ఉంటుందట. పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా చేస్తుందట. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ, ప్రభాస్ కాళ్లకు గాయాలు అవ్వడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. తదుపరి షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.